లలిత జ్యూవెలర్స్ ఓనర్ గురించి ఆసక్తికర విషయాలు.. ఆరోజు అమ్మ అలా చేయకుంటే జీవితం నాశనం
TeluguStop.com
టీవీల్లో ఎన్నో కంపెనీలకు మరియు ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు చూస్తూ ఉంటాం.
అయితే లలిత జ్యూవెలరీ యాడ్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.ఎవరో మోడల్స్ ఉండరు, అందాల ముద్దుగుమ్మలు ఆ యాడ్స్‌లో కనిపించరు, మోడలింగ్‌లో రాణించిన మోడల్స్ అందులో కనిపించకున్నా కూడా ఆ యాడ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
లలిత జ్యూవెలర్స్ కంపెనీకి తానే ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా కిరణ్ కుమార్ మారిపోయారు.
నా కంపెనీకి నేనే అంబాసిడర్‌గా వ్యవహరిస్తాని మొదలు పెట్టిన ఆయన అనూహ్యంగా గుర్తింపు దక్కించుకున్నాడు.
లలిత జ్యూవెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరును చూసి తెలుగు వ్యక్తి కాదనుకుంటారు.
కాని ఆయన పక్కా తెలుగు వ్యక్తి.నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త తగ్గరగా ఉండటం వల్ల భాష మరియు యాసలో కాస్త తేడాగా ఉంటుంది.
కిరణ్ కుమార్ నెల్లూరులో బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు.
అప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
తానే సొంతంగా బంగారు వస్తువులు తయారు చేసి అమ్మవచ్చు కదా అనుకున్నాడు.
అనుకున్నదే తడువుగా అమ్మ చేతికి ఉన్న గాజులను ఆమెను ఒప్పించి తీసుకున్నాడు.కొడుకుపై నమ్మకంతో ఆ తల్లి తన బంగారు గాజులు ఇచ్చింది.
ఆ బంగారు గాజులను కరుగబోసి కొన్ని చిన్న వస్తువులను చేశాడు.ఆ వస్తువులను చెన్నైకి తీసుకు వెళ్లి అమ్మడం ద్వారా మంచి డబ్బు వచ్చింది.
ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసి మళ్లీ వస్తువులు తయారు చేయడం, అమ్మడం చేశాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కిరణ్ కుమార్ తాను తయారు చేసిన బంగారు వస్తువులను ఎక్కువగా చెన్నైలోని లలిత జ్యూవెలర్స్‌కు వేసేవాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ షాప్ యజమాని షాప్‌ను అమ్మకానికి పెట్టాడు.కాస్త ఇబ్బంది అయినా కూడా దాన్ని కొనుగోలు చేశాడు.
లలిత జ్యూవెలర్స్‌ను కొనుగోలు చేసిన కొన్ని రోజుల్లోనే కిరణ్ కుమార్ అనూహ్యంగా లాభాలను దక్కించుకున్నాడు.
ఏడాదికి 11 వేల కోట్ల టర్నోవర్‌తో ప్రస్తుతం లలిత జ్యూవెలర్స్ రన్ అవుతోంది.
తల్లి గాజులు అమ్మేసిన పరిస్థితి నుండి వేల కోట్ల బిజినెస్‌ను విస్థరించిన కిరణ్ కుమార్ గారి జీవితం అందరికి ఆదర్శనీయం.
కష్టపడి, నమ్మకంతో పని చేస్తే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు ఎక్కవచ్చు అనేది కిర్ కుమార్ గారి జీవితం ద్వారా నేర్చుకోవాలి.
నలుగురికి ఇన్సిఫిరేషన్ అయిన కిరణ్ కుమార్ జీవితం గురించి మీరు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి.
ప్రవాస భారతీయులకు షాకిచ్చిన బడ్జెట్ .. ఎన్ఆర్ఐ పన్ను విధానం కఠినతరం