పంచారామాలలో ఒకటైన కుమారారామం ప్రత్యేకతలు ఇవే..!

పంచారామాలలో కుమారారామం ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందినది.11వ శతాబ్దంలో చాళుక్యులు రాజులు కట్టించిన ఈ ఆలయం సామర్లకోటలో ఉంది.

ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో సామర్లకోటలో వెలసిన కుమారారామం ఒకటని చెప్పవచ్చు.

ఇక్కడ ఆ పరమశివుని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

పంచారామాలలో ఒకటైన కుమారారామం గురించి కొన్ని ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల కథనం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని వదిస్తున్న సమయంలో తారకాసురుని గొంతులో ఉన్న ఆత్మలింగం ఐదు ముక్కలుగా విరిగి పడింది.

ఆ 5 బాగాలనే పంచారామాలుగా వెలిసాయని పురాణాలు చెబుతున్నాయి.అమరారామం, క్షీరారామం, భీమారామం, కుమారారామం, ద్రాక్ష రామంగా ప్రసిద్ధి చెందిన వీటిని పంచారామాలు అని పిలుస్తారు.

సామర్లకోటలో కొలువై ఉన్న కుమారారామం ఆలయంలో స్వామి 14 అడుగుల ఎత్తు లింగం మనకు దర్శనమిస్తుంది.

ఈ ఆలయంలో ఉన్న భీమగుండంలో స్నానం చేసే స్వామివారిని దర్శిస్తే ఎలాంటి కోరికలు కోరిన నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

"""/"/ ఈ ఆలయంలో ఉన్నటువంటి 14 అడుగుల సున్నపు రాయితో తయారు చేసిన శివలింగం ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతోంది.

ఈ లింగం రోజురోజుకు పెరుగుతూ ఉండటం వల్ల ఈ శివలింగం పై శిల కొట్టారని స్థానిక ప్రజలు చెబుతుంటారు.

ఈ స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నంది విగ్రహం కొలువై ఉంటుంది.

ఈ ఆలయంలో కేవలం శివుడు మాత్రమే కాకుండా అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

అదేవిధంగా నవగ్రహాలు వినాయకుడు కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఆలయాన్ని సందర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?