'ఖైరతాబాద్ గణేష్' గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? అలనాటి నుండి నేటివరకు ప్రతిష్టించిన విగ్రహాలు ఇవే..!
TeluguStop.com
వినాయకచవితి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాం.ఎందుకంటే పండుగ అన్నింట్లోకెళ్లా వినాయకచవితి పండుగ కోలాహలమే వేరు.
విలేజ్ లలో అయితే ఊరిప్రజలందర్ని ఏకంచేసి జరుపుకునేలా చేస్తుంది.ఇక ఎవరి ఇళ్లల్లో వారుంటూ బిజీ బతుకులు బతికే పట్న ప్రజలను ఒక దగ్గరచేసి పండుగ జరుపుకునేలా చేస్తుంది.
బాల గంగాధర తిలక్ ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు.
ఆ స్పూర్తితో ప్రారంభమయిందే ఖైరతాబాద్ గణేశ్…1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది.
అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం మనం 51 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నాం.చివరికి చేసే ఒక్క అడుగు విగ్రహం మేలిమి పసుపుతో చేస్తారట…ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.
ఖైరతాబాద్ గణేశ్ గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాల.గణేశుడి తొలిరోజులు """/"/
తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు.
1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.
1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
లడ్డూ విశిష్టత
ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు.2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.
గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు.ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.
"""/"/
మరిన్ని విషయాలు
ఓ సారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల పాటు ట్యాంక్‌బండ్‌పై ఉంచారు.
1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్ వినాయకుడు వెలుగువెలిగాడు.కళాతపస్వి కె.
విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.
విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ఏటా వైవిధ్యతను చాటుతున్నారు.ఇప్పుడు సింగరి శంకరయ్యతో పాటు ఆయన సోదరుడు సింగరి సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.