కీర్తి సురేష్ అక్క గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ ఎంత గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి నేటి తరం సినీ ప్రేక్షకులు అందరికి కూడా కీర్తి సురేష్ అంటే సావిత్రి అన్నట్లుగానే మారిపోయింది.
సాదాసీదాగా సాగిపోతున్న కీర్తి సురేష్ కెరీర్‌ను మహానటి సినిమా కీలక మలుపు తిప్పింది.
ఇక ఆ తర్వాత కీర్తి సురేష్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు.
కీర్తి సురేష్ కోసం కథ రాసుకుని ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది.
అయితే ఇక అందం అభినయానికి కీర్తి సురేష్ కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అనేది తెలిసిందే.
అయితే ఇక సినిమాల్లో నటించింది కాబట్టి కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలుసు.
కానీ కీర్తి సురేష్ కి ఒక అక్క ఉందని అక్క అచ్చం కీర్తి సురేష్ పోలికలతోనే ఉంటుందనీ.
కానీ ఇప్పుడు మాత్రం రూపురేఖలు మారిపోయాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.
కీర్తి సురేష్ అక్క పేరు రేవతి సురేష్.ఒకప్పుడు అచ్చం కీర్తి సురేష్ పోలికలతో కలిగి ఉండేది.
కానీ ఇటీవలి కాలంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోవడంతో ఒక్కసారిగా బరువు పెరిగి పోయింది కీర్తి సురేష్ అక్క రేవతి సురేష్.
ఇక ఇలా బరువు పెరిగి పోవడం వల్ల ఊహించని రీతిలో అవమానాలను ఎదుర్కొన్నారు ఆమె.
"""/" /
ఎంతో మంది బంధువులు ఎందుకు ఇంత లావు గా ఉన్నావు అంటూ కామెంట్ చేయడం తో ఎంతగానో బాధ పడేవారట.
కొన్ని కొన్ని సార్లు అద్దంలో చూసుకున్నప్పుడు.నాలో ఏదో లోపం ఉంది అనిపించేది అంతలా నాపై నాకే అసహ్యం కలిగించేలా విమర్శలు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆమె.
కానీ ఇప్పుడు చెల్లెలు కీర్తి సురేష్ సపోర్టుతో ఆమె మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చారు.
వర్కౌట్ పై ఎక్కువగా దృష్టి పెట్టి బరువు తగ్గారు.ఇటీవలే సరికొత్త లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆశ్చర్యపోయారు.
ఇక ఇది చూసిన తర్వాత ఈ ఫోటోలో ఉన్నది అసలు రేవతి సురేష్ కాదు అంటూ కొంతమంది కామెంట్ పెడుతున్నారు.
ఇదేం సెలెబ్రేషన్స్ రా బాబు.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో యువకుడి జననాంగాలకు ఏకంగా.?