క్లైమాక్స్ కోసం స్క్రిప్ట్ కూడా రాయని సినిమా కాంతారా … మరి ఎలా హిట్ కొట్టింది !

కాంతారా.రోజులు పెరుగుతున్న కొద్దీ థియేటర్లు కూడా పెంచుకుంటూ వెళ్తూ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ బద్దలు కొడుతూ వెళ్తున్న సినిమా.

ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక వ్యాసాలు, వార్తలు వచ్చాయి.అయినా కూడా ఇంకా ఎదో ఒక విషయం కొత్తగా తెలుస్తూనే ఉంది.

ఆలా తెలుస్తుంటే ప్రతిదీ ఎంతో కొత్తగా కనిపిస్తూనే ఉంది.ఇప్పడు కాంతారా దర్శకుడు చెప్పిన కొన్ని విషయాలు మాత్రం వినడానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి.

ఇప్పుడు అలాంటి కొన్ని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.ప్రతి సినిమాకు ప్రాణం క్లైమాక్స్.

అలాంటి ఒక క్లైమాక్స్ విషయంలో దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు.కానీ కాంతారా లాంటి సినిమాకు అసలు క్లైమాక్స్ సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా చేయలేదట.

ఈ విషయం తెలిసిన తర్వాత రిషబ్ కి కథ పైన నమ్మకం ఎక్కువగా ఉండటం అనుకోవాలా, లేక ఇలాంటి ప్రకృతి తో దేవుడిని కనెక్ట్ చేసే సినిమాలకు దైవబలం కూడా తోడయ్యింది అని నమ్మాలా అర్ధం కానీ పరిస్థితి.

ఇక రిషబ్ కేవలం క్లైమాక్స్ కోసం ఒక లైన్ మాత్రం అనుకున్నాడట.దాన్ని ఎలా తీయాలో ఒక నాలుగు సీన్స్ కూడా మనసులో ఇమాజిన్ చేసుకున్నాడట.

తన మైండ్ లో కేవలం దేవుడు హీరోలో ఆవహిస్తాడు అని అందుకు సంబందించిన కొన్ని క్లారిటీ లేని సీన్స్ ని సినిమాటోగ్రాఫర్ మరియు ఫైట్ మాస్టర్స్ కి వివరించాడు.

"""/"/ వాళ్ళు కూడా కొన్ని షాట్స్ నాచురల్ మ్యూజిక్ తో జోడించి తీశారు.

అవి చూసాక అక్కడ సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపించింది.అదే సైలెన్స్ థియేటర్లలో కూడా కనిపించింది.

వాస్తవానికి ఈ సినిమాకు అసలు స్క్రిప్ట్, డైలాగ్స్ రాసింది కూడా లేదు.రిషబ్ ఒక లైన్ చెప్తే కో డైరెక్టర్స్ కొన్ని డైలాగ్స్ సిద్ధం చేసేవారట.

సినిమాలో సీన్స్ ఏంటి, అవి ఎలా తీయాలో ఏమి చెప్పవద్దు కాదట.ఎందుకంటే రిషబ్ కి కూడా ఏం తీయాలో తెలియదు ఆ టైం కి.

"""/"/ ఇక రిషబ్ కి ఈ సినిమా కేవలం ఒక నమ్మకం.సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం.

కానీ అది పాన్ ఇండియా అంటే ఒప్పుకోదు.కాంతారా కేవలం తన ఏరియా లో ఉండే సంప్రదాయాలను మిగతా కర్ణాటక వారికి తెలియచేయడం.

కానీ ఆ తర్వాత మిగతా భాషల్లోకి వెళ్లడం అక్కడ కూడా హిట్ అవ్వడం అన్ని ఆలా జరుగుతూ వెళ్తూనే ఉన్నాయ్.

తన రాష్ట్రంలో మిగతా వారికి కూడా తెలియని ఒక దైవత్వం, ప్రకృతి గురించి మిగతా వారికి తెలియచేసే ప్రయత్నం గొప్ప నమ్మకంతో కూడి మరింత గొప్ప చిత్రం గా బయటకు వచ్చి ఈ రోజు నేషనల్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.

/p.

రామ్ చరణ్ దర్గాకు వెళ్లడంపై తనికెళ్ల భరణి రియాక్షన్ ఇదే.. ఆయన ఏమన్నారంటే?