కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఎలా అవతరించాడో తెలుసా..?

సకల దేవ దేవతలలో ముందుగా వినాయకుడికి పూజ చేసిన అనంతరం ఎటువంటి కార్యాన్నైనా ప్రారంభించడం మన ఆచారంగా భావిస్తారు.

అందుకే వినాయకుని మొదటి పూజ్యుడని పిలుస్తారు.అదే విధంగా వినాయకుడిని పూజించడం వల్ల మనం చేసే కార్యాలలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భావించడం వల్ల ముందుగా వినాయకుడికి పూజ చేస్తారు.

వినాయకుడి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

మొట్టమొదటగా వినాయకుడు ఇక్కడే అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.అయితే ఈ వర సిద్ధి వినాయకుడి అవతరణ ఎలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

పురాతన కథనం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో కాణిపాక గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు.

వారిలో ఒకరు మూగ, ఒకరు చవిటి, ఒకరు గుడ్డి వైకల్యం ఉండేది.ఈ ముగ్గురు వ్యక్తులు వారికున్న పొలంలో తోటలో ఉన్న నీటి ద్వారా పంటలను సాగు చేసేవారు.

కొద్ది రోజులకు ఆ బావి ఎండిపోవడంతో ఆ బావిను మరింత లోతుగా తవ్వాలని భావించారు.

ఈ నేపథ్యంలోనే ఈ బావిని తవ్వుతున్న క్రమంలో వారి గుణపానికి ఒక రాయి తగులుతుంది.

అయితే ఆ రాయి నుంచి రక్తం కారడంతో వారు మరింత లోతుగా తవ్వడం వల్ల ఆ బావి నుంచి వినాయకుడు ఉద్భవిస్తాడు.

"""/" / ఈ విధంగా ఆ వినాయకుడికి ముగ్గురు అన్నదమ్ములు పూజలు చేయటం వల్ల వారిలో ఉన్న అంగవైకల్యం తొలగిపోతుంది.

అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం వల్ల ఆ సోదరుల సగం పొలం నీటితో తడిసిపోతుంది.

ఆ విధంగా నూతి నుంచి ఉద్భవించిన వినాయకుడికి ఆ గ్రామ ప్రజలు పూజలు చేసేవారు.

తర్వాత క్రీస్తు శకం 11 వ శతాబ్దంలో చోళుల రాజులు కాణిపాక వరసిద్ధి వినాయకుడికి ఆలయం నిర్మించారు.

ఈ ఆలయంలోని వినాయకుడు రోజురోజుకి పెరుగుతారని అక్కడ ప్రజలు నమ్ముతారు.ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఏదైనా ఒక కోరికను కోరుకునే టప్పుడు వారికి ఇష్టమైనది అక్కడ వదలటం వల్ల వారి కోరిక నెరవేరుతుందని భావిస్తారు.

అంతేకాకుండా వినాయకుని సత్యదేవుడుగా కూడా పిలుస్తారు.ప్రతిరోజు కానిపాక వరసిద్ధి వినాయకుని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం కూడా ఒకటని చెప్పవచ్చు.

విక్రమ్ హీరోగా వస్తున్న ‘వీర ధీర శూరన్ ‘ టీజర్ లో ఇవి గమనించారా..?