రక్తం కారుతున్న ఇంటికి వెళ్లిపోయిన కళ్ళు చిదంబరం .. ఏం జరిగింది

కళ్లు చిదంబరం.కళ్లు సినిమాలో నటించి కొల్లూరు చిదంబరం కాస్తా కళ్లు చిదంబరంగా మారిపోయాడు.

పోర్టు ట్రస్టులో ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసి.సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన.

చనిపోయే వరకు సినిమా రంగంతోనే ఉండిపోయారు.తన జీవితాన్ని నాటకరంగానికి, నాటకరంగం ద్వారా వచ్చిన డబ్బునే సేవా కార్యక్రమాలకు వినయోగించాడు చిదంబరం.

తాజాగా కళ్లు చిదంబరం గురించి ఆయన రెండో కొడుకు సాయి రాఘవ పలువు విషయాలు వెల్లడించారు.

ఇంతకీ ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.ఆగస్టు 8, 1948లో నాగుబాయమ్మ, వెంకట సుబ్బారావుకు కళ్లు చిదంబరం జన్మించాడు.

విజయనగరంలో చిన్ననాటి విద్యాభ్యాసం చేశాడు.విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చదివాడు.

ఓవైపు పోర్టు ఉద్యోగం చేస్తూనే మరో దిక్కు నాటకాలు వేసేవాడు.పేరు మోసినన సినిమటోగ్రాఫర్‌ రఘు దర్శకత్వంలో కళ్లు సినిమా చేసి సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

నిజానికి ఆయనకు పుట్టుకతో మెల్లకన్ను లేదు.నిరంతరం నాటకాలు వేయడం మూలంగా నరం పక్కు వెళ్లి మెల్లకన్ను ఏర్పడింది.

ఆ లోపమే తను కలిసి వచ్చింది.ఆ తర్వాత 300 సినిమాల్లో నటించాడు.

"""/"/ అప్పట్లో కళ్లు సినిమా షూటింగ్ వైజాగ్ లో జరిగింది.ఒక్కో రోజు మేకప్ తో అలాగే ఇంటికి వెళ్లేవాడు.

ఒకరోజు రక్తం కారుతున్న మేకప్ లో ఇంటికి వచ్చాడు.అప్పుడు ఇంట్లో వాళ్లంతా ఎంతో భయపడ్డారు.

కానీ తనకు ఏమీ కాలేదని తెలుసి ఊపిరి పీల్చుకున్నారు.అటు కుటుంబ జీవితం, ఆఫీస్‌ ను మేనేజ్ చేస్తూ సినిమాల్లో నటించాడు చిదంబరం.

అమ్మోరు సినిమాలో తన నటన జనాలను ఎంతో ఆకట్టుకుంది.2013 మే నెలలో ఊపిరితిత్తుల సమస్య రావటంతో ఇంట్లోనే ఉండేవాడు.

రెండున్నర ఏండ్లు ఆక్సీజన్ కాన్సన్ ట్రేషన్ మీదే ఉన్నాడు.ఐసీయూలో ఉన్నా కూడా సినిమాల గురించే ఆలోచించే వాడు.

2015 అక్టోబర్ 198న నవ్వు ముఖంతోనే కన్నుమూశాడు కళ్లు చిదంబరం.సినిమా పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయింది.

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్..!!