జయలలితను మొదటి సారి చూసి భయపడ్డ శోభన్ బాబు

శోభన్ బాబు, జయలలిత.వీరిద్దరి ప్రేమాయణం గురించి యావత్ దేశానికి తెలిసినదే.

వీరుద్దరు కలిసి నటించిన తొలి తెలుగు సినిమా డాక్టర్ బాబు.ఆ సినిమా గురించి మాట్లాడేందుకు వెళ్లే సమయంలోనే వీరిద్దరిని తానే పరిచయం చేసినట్లు చెప్పారు టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

శోభన్ బాబును కోయంబత్తూరు ఎయిర్ పోర్టు నుంచి కారులో ఎక్కించుకోని ఊటీకి తీసుకెళ్లి జయలలితతో పరిచయం చేయించినట్లు చెప్పారు.

జయ లలితను చూడ్డం అదే తొలిసారి కావడంతో.ఎలా ఉంటారో? ఎలా మాట్లాడుతారో? అని శోభన్ బాబు భయపడినట్లు భరద్వాజ చెప్పారు.

కాసేపట్లోనే ఇద్దరు మధ్య మాటలు కలిసినట్లు చెప్పారు.ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకోగానే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలిదన్నారు భరద్వాజా.ప్రతివారికి కొన్ని కొన్ని అభిరుచులు ఉంటాయని చెప్పారు తమ్మారెడ్డి.

ఆయా ఇష్టాఇష్టాల కారణంగా కొందరు మనుషులు తొందరగానే దగ్గర అవుతారని చెప్పారు.అలా శోభన్ బాబు, జయలలిత అభిప్రాయాలు కలవడంతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని చెప్పారు.

ప్రతిదాన్ని నెగెటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.ఇద్దరు కలిసి ఉన్నమాట వాస్తవం అని చెప్పారు.

కానీ వారిద్దరికి పిల్లలున్నారు.వారిని బయటకు కనపడకుండా ఉంచారు అనే మాటలను భరద్వాజ ఖండించారు.

"""/"/ అంతేకాదు.శశికళ లాంటి పిచ్చిముండను తీసుకొచ్చి అంత మంచి పొజిషన్ కు తీసుకెళ్లడం కంటే సొంత పిల్లలను రాజకీయంలోకి తీసుకువచ్చే వారని చెప్పారు.

క్యాసెట్లు అమ్ముకునే శశికళను సీఎం స్టేజికి తీసుకెళ్లిన జయలలిత.సొంత బిడ్డలనే ఆ స్థాయికి తీసుకెళ్లేవారు కదా అన్నారు.

బిడ్డను రహస్యంగా ఉంచారని వార్తలు రావడం.మేమే జయలలిత బిడ్డలమంటూ కొందరు మీడియా ముందు హడావిడి చేయడం నవ్వు తెప్పించే విషయాలన్నారు.

బిడ్డలు ఉన్నారనే మాట నూటికి నూరు పాళ్లు వాస్తవం కాదని చెప్పారు తమ్మారెడ్డి.

వీడియో: యముడికే షాక్.. ట్రైన్ కింద కారు నుజ్జునుజ్జు.. డ్రైవర్ మాత్రం సేఫ్..