జైపూర్ లో లక్షల కోట్ల నిధి ఉందన్న వార్తల్లో వాస్తవం ఎంత?

ఇవాళ్టికీ మన దేశంలో ఎవరు గుర్తించలేని.లక్షల కోట్ల రూపాయల ఖజనా దాగి ఉంది.

వాటి మొత్తం విలువ ఎంత? మన భూగర్భంలో ఉన్న నిధి ఎంత పెద్దది? ఈ నిధి ఎలా దొరుకుతుంది? దాన్ని మనం గుర్తించ గలిగితే ప్రపంచ బ్యాంకు దగ్గర మనం అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

అదే కనుక దొరికితే మన దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది.అయితే కొన్ని వేల ఏండ్ల క్రితం కుబేరుడు నిక్షిప్తం చేసిన ఖజానాను కనిపెట్టడం ఎలా? ఈ ఖజనా గురించి తెలుసుకోవాలంటే కొన్ని ఏండ్ల పాటు వెనక్కి వెళ్లాలి.

ఒకప్పుడు బంగారం అంటే భారతదేశం.కానీ ప్రస్తుతం మనం బంగారం నిల్వల్లో పదో స్థానంలో ఉన్నాం.

ప్రస్తుతం ఆర్బీఐ దగ్గరున్న బంగారానికి మాత్రమే లెక్క పత్రాలు ఉన్నాయి.కానీ మన దగ్గర కోటల్లో, సొరంగాల్లో ఉన్న బంగారు నిధుల గురించి ఎలాంటి లెక్కలు లేవు.

ఇంతకీ మన దగ్గరున్న బంగారు నిల్వల విలువెంతో తెలుసా? మన దేశ గతిని మార్చే నిధి ఎక్కడ ఉందో ఎరుకేనా? ఈ వేల కోట్ల నిధిని ఎవరు దాచిపెట్టారో తెలుసా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ సుమారు 5 వందల ఏండ్ల క్రితం ఓ మొఘల్ చక్రవర్తి.తాను యుద్ధాల్లో గెలిచిన రాజుల నుంచి దోచుకున్న సొమ్మునంతా.

తాను నివసించిన కోటలోనే దాచి పెట్టాడు అనే సమాచారం ఉంది.ఇప్పటికీ ఆ నిధి అలాగే ఉందనే ప్రచారం ఉంది.

వాస్తవాలు మాత్రం బయటకు తెలియదు.ఇంతకీ ఆ కోట ఎక్కడ ఉందో తెలుసా? జైపూర్ లో ఉన్నది.

దాని పేరు జైఘర్ కోట.అక్బర్ సేనాపతి మాన్సింగ్ 141 యుద్ధాల్లో గెలిచిన అపార సంపదను ఇక్కడే దాచి పెట్టారు అని అంటారు.

అయితే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఈ నిధి గురించి వెతులాట మొదలు పెట్టిందని.

ఆ సంపదను ఢిల్లీకి తరలించేందుకు ఆ మార్గంలో రాకపోకలు నిలిపేశారని వార్తలున్నాయి.కానీ వాస్తవం అనడానికి ఎలాంటి ఆధారం లేదు.

ఆ తర్వాత దీని గురించి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని తెలుస్తోంది.

‘ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్సే దిక్కు ! తెలంగాణ భవన్ కు వారంతా క్యూ