ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమ నటులు.. ఇంతకీ ఆ కుటుంబం ఎవరిదో తెలుసా?

డాక్టర్ల ఫ్యామిలీలలో అందరూ డాక్టర్లు ఉన్నట్లే.లాయర్ల ఫ్యామిలీలో లాయర్లు ఉన్నట్లే.

యాక్టర్ల ఫ్యామిలీల్లోనూ యాక్టర్లు ఉన్నారు.కానీ కొన్ని యాక్టర్ల ఫ్యామిలీల్లో అందరూ జాతీయ ఉత్తమ నటులే ఉండటం విశేషం.

ఇంతకీ ఆ ఫ్యామిలీ ఎవరిదో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

ద‌క్షిణాదిన ఉత్త‌మ న‌టుల ఫ్యామిలీ అనగానే టక్కున గుర్తొస్తుంది హాస‌న్ ఫ్యామిలీ.ఆ కుటుంబంలో ముగ్గురు జాతీయ ఉత్త‌మ నటులు ఉన్నారు.

అన్న‌ద‌మ్ములైన చారు హాస‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ ఉత్‌తమ న‌టులు కాగా అవార్డులు అందుకోగా.

ఆ తర్వాత చారు హాస‌న్ కుమార్తె సుహాసిని సైతం జాతీయ ఉత్త‌మ న‌టీమణిగా పురస్కారం అందుకుంది.

వీళ్లంద‌రిలో ముందుగా క‌మ‌ల్‌ హాసన్ ను జాతీయ అవార్డు వరించింది.బాలూ మ‌హేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన మూండ్ర‌మ్ పిరైలో న‌ట‌న‌కు గాను ఆయనకు 1982లో ఉత్త‌మ న‌టుడిగా అవార్డు వచ్చింది.

ఆ త‌ర్వాత నాయ‌క‌న్‌, ఇండియ‌న్ సినిమాల‌కు కూడా ఆయనకు ఉత్తమ నటుడి అవార్డులు వచ్చాయి.

"""/"/ క‌మ‌ల్ హాసన్ త‌ర్వాత ఆ ఫ్యామిలీలో సుహాసిని ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు తీసుకుంది.

కె.బాల‌చంద‌ర్ తెరకెక్కించిన సింధు భైర‌విలో సింధుగా ఆమె నటించిన పాత్రకు ఈ అవార్డు వచ్చింది.

తన కూతురు జాతీయ అవార్డు అందుకున్న మరుసటి ఏడాది చారు హాసన్ బెస్ట్ యాక్టర్ అవార్డు పొందాడు.

గిరీశ్ కాస‌ర‌వ‌ల్లి తీసిన త‌బ‌ర‌న క‌థే సినిమాలో నటనకు గాను ఆయన ఈ అవవార్డు వచ్చింది.

మొత్తంగా వరుసగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు జాతీయ ఉత్తమ అవార్డులు రావడం చాలా అరుదుగా చెప్పుకోవచ్చు.

కమల్ హాసన్, చారు హాసన్, సుహాసిని జాతీయ ఉత్తమ నటులుగా గుర్తింపు పొందడం పట్ల వారి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

నటన పుట్టిన ఇల్లుగా వీరి ఇంటిన అభివర్ణించాలు పలువురు సినీ జర్నలిస్టులు.అంతేకాదు.

నటన అనేది ఈ కుటుంబ సభ్యులకు మకుటంలా ఉందన్నారు మరికొందరు సినీ పెద్దలు.

ఆ నంబర్‌కు ఫోన్ చేసి ఆశ్చర్యపోతున్న అమెరికన్లు.. ఎందుకో తెలుసా?