సెకండ్ హాఫ్ గండాన్ని గట్టెక్కడానికి హను రాఘవపూడికి ఎన్నేళ్ళ సమయం పట్టిందో తెలుసా ?

హను రాఘవపూడి.గత పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దర్శకుడు సీతా రామం అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తొలి సినిమాగా అందాల రాక్షసి అనే చిత్రంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హను రాఘవపూడి ఆ తర్వాత నాచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీర ప్రేమ గాధ అని చిత్రాన్ని తెరకెక్కించగా ఇది యావరేజ్ సినిమాగా నిలిచింది.

ఆ తర్వాత నితిన్ తో 'లై' అని మరో సినిమా చేయగా అది ఫ్లాప్ కావడంతో శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్లో పడి పడి లేచే మనసు అనే మరో సినిమా తీయగా అది సైతం ఫ్లాప్ అయింది.

ఇక చివరిగా 2022లో సీతారామం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా ఇన్నాళ్లకు ఒక సరైన హిట్టు ని తన ఖాతాలో వేసుకున్నాడు హను రాఘవపూడి.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం కి చెందిన హను రాఘవపూడి సినిమాలోకి రాకముందు చంద్రశేఖర్ ఏలేటి వద్ద దర్శకుడిగా అసిస్టెంట్ గా పని చేశాడు.

అయితే, ఒక్కడున్నాడు, అనుకోకుండా ఒకరోజు అనే మూడు చిత్రాలకి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.

ఆ తర్వాత 2012లో మొదటి సారిగా అందాల రాక్షసితో దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.

ఇక 2016 లో డాక్టర్ ని పెళ్లాడిన హను రాఘవపూడి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

"""/"/ వాస్తవానికి హను రాఘవపూడికి సినిమాలన్నీ కూడా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి జనాలకి గుదిబండగా మారి గత చిత్రాలన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.

ఇక తన మార్క్ డైరెక్షన్ తో క్లాస్ ఆడియన్స్ లో ప్రస్తుతం సీతా రామం సినిమాతో ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు.

సెకండ్ హాఫ్ గండాన్ని సీతా రామం సినిమాతో విజయవంతంగా దాటడమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా కూడా నిలిచిపోయేలా అందించాడు.

"""/"/ మనసుకు హత్తుకునే ఎన్నో సంభాషణతో కవితాత్మకమైన ఈ సినిమాను తీయడానికి హను రాఘవపూడి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది.

ఇక ఇటీవల కాలంలో లవ్ స్టోరీస్ కి చరమ గీతం పాడుతున్న సందర్భంలో సీతా రామం సినిమా మంచి ప్రేమ కావ్యంలా అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ నటన అద్భుతంగా ఉంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు…