భూమిపై కైలాసంగా పేరుపొందిన ఆలయం ఏమిటో... ఆలయ విశిష్టత ఏమిటో తెలుసా?
TeluguStop.com
మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి.అదేవిధంగా పుణ్య నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.
ఈ క్రమంలోనే గంగానదిలో రెండు వేల సార్లు మునిగినా, కాశీ పుణ్యక్షేత్రంలో లక్షల సంవత్సరాలు జీవించిన వచ్చే పుణ్యఫలం కేవలం శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే అంత పుణ్యఫలం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.
శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని భూమిపై వెలసిన కైలాసంగా భావిస్తారు.
మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ఒకటి.
పూర్వ కాలంలో ఎన్నో హిందూ దేవాలయాలు రాజుల చేతులలో ధ్వంసమయ్యాయి.అయినా ఈ శ్రీశైల క్షేత్రాన్ని ఏ రాజులు ధ్వంసం చేయకపోగా ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రమైన ఆలయంగా భావించడం విశేషం.
పురాణాల ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడు చాలా కాలం పాటు గాయత్రి దేవి మంత్రం జపిస్తూ, బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా ఉండే వరాన్ని పొందాడు.
అరుణాసురుడు ఈ వరం పొందడంతో భయపడిన దేవ దేవతలందరూ ఆదిశక్తి శరణు కోరారు.
ఈ క్రమంలోనే అమ్మవారు ప్రత్యక్షమై అతను గాయత్రీ మంత్రం జపిస్తూ ఉన్నంతసేపు అతనికి మరణం ఉండదని చెబుతారు.
ఈ క్రమంలోనే దేవతలందరూ పథకం ప్రకారం బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు.బృహస్పతి రాకతో అరుణాసురుడు ఆశ్చర్యపోతారు.
"""/" /
అరుణాసురుడుతో బృహస్పతి ఇద్దరం అమ్మ వారికోసమే జపం చేస్తున్నాము.కనుక ఈ రాకలో ఆశ్చర్యమేమీ లేదని చెప్పగా.
అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజించాలి అని అహంకారంతో గాయత్రి మంత్రాన్ని ఆపేసాడు.
ఈ క్రమంలోనే అమ్మవారు భ్రమరాంబ రూపంలో అరుణాసురుని చుట్టుముట్టి అతన్ని సంహరిస్తారు.అందుకే ఇక్కడ కొలువైన అమ్మవారిని భ్రమరాంబిక అని పిలుస్తారు.
ఈ ఆలయంలో శివపార్వతులు మల్లికార్జున భ్రమరాంబగా భక్తులకు దర్శనం ఇస్తారు.ఈ ఆలయంలోని గర్భగుడిలో వెనుక భాగంలో క్షుణ్ణంగా వింటే ఝుమ్మని భ్రమర నాదం వినబడుతుంది.
ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని భూమిపై వెలసిన కైలాస క్షేత్రంగా భక్తులు భావిస్తారు.
దృశ్యంలో మీనా పాత్రను ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. అసలేం జరిగిందంటే?