జేడీ చక్రవర్తి చేసిన పనికి బోరున విలపించిన రంభ.. ఏం జరిగింది ?

పెళ్లి సందడి లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన తర్వాత దానిని మించి ఒక సినిమా తీయాలని దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు భావించాడు.

దాంతో ఉన్న ఫలంగా బొంబాయి ప్రియుడు కథను సిద్ధం చేసుకున్నారు.అప్పటికే గులాబీ, మృగం, దయ్యం సినిమాలు చేసి ఉన్న జె డి చక్రవర్తిని హీరోగా తీసుకొని, ఫుల్ ఫార్మ్ సినిమాలో తీస్తున్న నటి రంభను హీరోయిన్ గా ఒకే చేసుకున్నారు.

ఇక రాఘవేంద్ర రావు సినిమా అంటే అందరికి తెలిసిందే కదా, వూళ్ళో ఉన్న పళ్ళ తోటలు , పూల తోటలు ఖాళి అయ్యేదాకా అయన వదలరు.

ఇక షూటింగ్ జరుగుతున్న క్రమం లో ఒక చిన్న సంఘటన వల్ల రంభ గుక్క పెట్టి ఏడ్చిందట.

మరి ఆ సంఘటన ఏంటి ? రంభ ఎందుకు ఏడ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ రోజు షూటింగ్ లో పై నుంచి కిందకు బత్తాయి పళ్ళను వేస్తూ షూటింగ్ చేస్తున్నారు దర్శకుడు.

ఇక ఇదే చిత్రంలో తొలిసారి పైనాపిల్ ని కూడా వాడారు.ఇక సరదాగా నవ్వుతు ఈ సారి బత్తాయి పళ్ళు నీ బొడ్డు మీద వేస్తాను అని, అది అవ్వగానే పుచ్చ కాయ కూడా తెప్పించాను అది కూడా వేస్తానని చెప్పి సరదాగా నవ్వించారట రాఘవేంద్ర రావు గారు.

దాంతో రంభ మరియు ఇతర యూనిట్ మెంబర్స్ కూడా నవ్వులలో పడిపోయారట.అప్పటికే సీరియస్ మూడ్ లోకి వెళ్లిన రాఘవేంద్ర రావుని గమనించలేదు హీరో మరియు హీరోయిన్.

అప్పటికే ఒక పాట కోసం దర్శకుడు ముప్పు తిప్పలు పడుతున్నారట. """/"/ దాంతో అలాగే జోకులు పేల్చుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారట, కోపంగా వచ్చి నవ్వుతున్న రంభ దగ్గరికి వచ్చి ఎంత సేపు టైం తీసుకుంటారో తీసుకోండి.

మీ నవ్వులు అయ్యేదాకా షూటింగ్ ఆపుతాను.అయ్యాక చెప్తే అప్పుడే మొదలు పెడతాను అని అన్నారట.

ఆ ఒక్క మాటతో షూటింగ్ లొకేషన్ లోనే రంభ గుక్క పెట్టి ఏడ్చిందట.

  అయితే జె డి చక్రవర్తి ఆమెతో జోకులు వేయడం వలెనే ఇదంతా జరిగిందట.

 జె డి చక్రవర్తికి నేను ఏం తప్పు చేసానని నన్ను ఇలా కోప్పడ్డారు అంటూ చెప్తూ బాధ పడిందట.

ఇక ఆ తర్వాత చిత్ర యూనిట్ ఆమెకు సర్ది చెప్పడంతో తిరిగి ఆ పాట షూటింగ్ మొదలయ్యింది.

ఇక ఈ చిత్రం విడుదల అయ్యాక మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.