బాలీవుడ్ హీరోయిన్ల గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు
TeluguStop.com
సినిమా తారలకు సంబంధించి ఏ విషయమైనా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.వాళ్ల లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్లకు నచ్చిన బ్రాండ్స్ ఏంటి? వాళ్లకు ఇష్టమైన ప్రదేశాలు ఏంటి? వాళ్ల ఫ్యామిలీ విషయాలేంటి? ఒకటేమిటీ చాలా విషయాల్లో వారి గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తారు.
నిత్యం వారిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ రకరకాల విషయాలు తెలుసుకుంటారు.అందులో భాగంగానే పలువురు బాలీవుడ్ నటీమణుల గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleవిద్యా బాలన్/h3p """/"/
బాలీవుడ్ లో అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకుంది విద్యా బాలన్.
అయితే తను నటి కావడానికి ముందు సుమారు 40 స్ర్కీన్ టెస్టులు చేయించుకోవాల్సి వచ్చిందట.
అంతేకాదు.17 సార్లు మేకప్ షూట్లు చేసుకుందట.
ఆ తర్వాత నటికగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అద్భుత సినిమాలు చేసింది.
కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.h3 Class=subheader-styleప్రియాంక చోప్రా/h3p """/"/
ఈమె 2002లో తమిళ సినిమా ద్వారా తన సినిమా కెరీర్ మొదలు పెట్టింది.
మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గి.అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
ఆమె ప్రస్తుతం పాప్ గాయకుడు నిక్‌జోనాస్‌ను పెళ్లి చేసుకుంది.అమెరికాలో స్థిరపడింది.
అక్కడే హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.h3 Class=subheader-styleకత్రినా కైఫ్/h3p """/"/
ఈమెకు సినిమాల విడుదల విషయంలో చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి.
ఈమె సినిమా విడుదల అవుతుంది అంటే సిద్ధివినాయక దేవాలయంతో పాటు మౌంట్ మేరీ చర్చి, అజ్మీర్ షరీఫ్ దర్గాలను సందర్శిస్తుందట.
కొంత కాలంగా విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడుపుతున్న ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
H3 Class=subheader-styleఐశ్వర్య రాయ్/h3p """/"/
ఈ అందాల భామ సుమారు 6 భాషలు మాట్లాడుతుంది.
బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందు తను ఓ టీవీ సిరియల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేసింది.
ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.ఆమె 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది.
2009లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం తీసుకుంది.ఫ్రాన్స్ ప్రభుత్వం ఆమెను ఒర్డ్రే డెస్ ఆర్ట్స్ డెస్ లెట్టెర్స్ అవార్డు ఇచ్చి గౌరవించింది.
H3 Class=subheader-styleపరిణీతి చోప్రా/h3p """/"/
ఈమె చాలా క్లవర్ స్టూడెంట్.12వ తరగతి ఫలితాల్లో ఆమె ఇండియా నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచింది.
అప్పటి రాష్ట్రపతి తనను సత్కరించారు కూడా.ఆమెకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం.
ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టి మంచి హీరోయిన్ గా ఎదిగింది.
H3 Class=subheader-styleదీపికా పదుకొనే/h3p """/"/
బాలీవుడ్‌లో 500 కోట్ల క్లబ్‌లో నటి దీపికా.వరుస హిట్లు సాధిస్తూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆమెకు బాగా తినడం అన్నా.తాగడం అన్నా చాలా ఇష్టం.
అయితే తను ఎంత తిన్నా.ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి13, సోమవారం 2025