నటి బెంగళూరు పద్మ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నటులు సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సంగతి అందిరకీ తెలిసిందే.

ఒకప్పుడు హీరోలుగా చేసిన వారు ప్రస్తుతం విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

హీరోయిన్స్ అయితే తల్లి పాత్రలతో పాటు అత్త పాత్రలు సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

మరికొందరు అయితే సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు.సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాల స్థానం ఏర్పరుచుకున్న రాశి సైతం సీరియల్స్‌లో నటిస్తోంది.

కాగా నటి బెంగళూరు పద్మ కూడా సీరియల్‌లో నటిస్తోంది.సీనియర్ కమెడియన్ స్వర్గీయ అల్లురామలింగయ్య నటించిన ‘ఆలు మగలు’చిత్రంలో పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైన పద్మ పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో పోషించారు.

మెగాస్టార్ చిరు‘స్టూవర్ట్ పురం దొంగ’లోనూ పద్మ నటించింది.మొత్తం దాదాపుగా 150 సినిమాల్లో నటించిన పద్మ ప్రముఖ నటుడు అరుణ్ కుమార్‌ను మ్యారేజ్ చేసుకుంది.

ఆ తర్వాత చాలా కాలం పాటు ప్రేక్షకులకు కనిపించలేదు.ఇటీవల కాలంలో సీరియల్ ద్వారా బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను పలకరించింది.

జీ5 చానల్‌లో ప్రసారమవుతున్న ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌లో అనుకు తల్లిగా పద్మ చక్కగా నటిస్తోంది.

"""/"/ నటి బెంగళూరు పద్మ అప్పట్లో వెండితెరపై అలరించగా, ప్రస్తుతం బుల్లితెరపైన కనిపించడం పట్ల సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన సీరియల్‌గా కొనసాగుతోంది.ఇకపోతే నటి పద్మ-అరుణ్ కుమార్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక అబ్బాయి సంతానం.

కాగా పద్మ కూతురు గాయత్రి అందరికీ తెలిసే ఉంటుంది.శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ ఫిల్మ్‌లో అప్పుగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో హారతిగా ప్రేక్షకుల మెప్పు పొందింది గాయత్రి.

గాయత్రికి ఇటీవల మ్యారేజ్ అయింది.ఇకపోతే నటి పద్మ బుల్లితెరపై కనిపించడం పట్ల ప్రేక్షకులు సంతోషపడుతున్నారు.

నటి పద్మ చాలా కాలం గ్యాప్ తర్వాత స్క్రీన్‌పై కనిపించడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అందరిలాగా పద్మ కూడా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారని అనుకుంటున్నారు.

అడవిలో ఊహించని ఘోరం.. తండ్రీకొడుకులను చంపేసిన ఎలుగుబంటి.. షాకింగ్ వీడియో వైరల్!