అశ్విని దేవతలు అంటే ఎవరు.. వీరికి వైద్యశాస్త్రానికి ఉన్న సంబంధం ఏమిటి..?

సనాతన ధర్మంలో అశ్విని దేవతల( Ashwini Devathalu ) గురించి దాదాపు చాలామందికి తెలియదు.

అశ్విని దేవతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అశ్విని దేవతలు సూర్యపుత్రులని పండితులు చెబుతున్నారు.

వీరు కవలలు.వీరి సోదరీ ఉష( Usha ).

ఆమె ప్రతి రోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేపుతూ ఉండేది.ఆ తర్వాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరీ ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు( West Direction )కు ప్రయాణిస్తారని పురాణలలో ఉంది.

ఇంకా చెప్పాలంటే వీరి ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం అని పండితులు చెబుతున్నారు.

అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది.ఆ రథం చాలా బృహత్తరమైనది.

అది హిరణ్యంతో నిర్మితమై ఉంది.మూడు గుర్రాలు రథన్ని నడుపుతూ ఉంటాయి.

అద్వరాశ్వాలనే ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎప్పుడూ యవ్వనంగా అత్యంత ఉత్సాహంగా ఉంటాయి.

చిత్రమైన ఈ రథానికి చక్రాలు మూడే ఉంటాయి. """/" / ముఖ్యంగా చెప్పాలంటే సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.

ఆ రథంలో ఒక వైపు ధనం మరో వైపు తేనే, సోమ రసం మరోవైపు ఆయుధాలు ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే రథం పై భాగంలో వేయి పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.

ఈ దేవతలు ధర్మ పరులు, సత్యసంధులు అని ఈ పండితులు చెబుతున్నారు.వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.

"""/" / వీరు ఆరోగ్య సమస్యలు ( Health Problems )ఉన్న వాళ్లను అనేక సమయాలలో ఆహ్వానం పై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

వైద్యశాస్త్రానికి అద్భుతమైన ఈ దేవతలు కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం, కుడి ప్రక్కన మృత సంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమ వైపు అమృత కలశాన్ని పట్టుకొని ధన్వాంతరి కలిగి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

అలా తోడుండే భాగస్వామి కావాలి.. హీరోయిన్ రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!