మనుషుల్ని నమ్మ కూడదు అని అర్థమైంది.. కన్నీళ్లు పెట్టిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా బాధలు?

సిని సెలబ్రిటీల జీవితాలు ఎంతో విలాసవంతంగా ఉంటాయి అన్నది మాత్రమే అందరికీ తెలుసు.

కానీ అదే సెలబ్రిటీలను కదిలిస్తే కన్నీళ్లు పెట్టించే బాధలు కూడా దాగి ఉంటాయి అన్నది మాత్రం కొంత మంది చెబితే అర్థమవుతుంది.

తమ జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి చెబుతూ ఉంటే ఇక అభిమానులకు కన్నీళ్లు ఆగడంలేదు అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సుధా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఇబ్బందులు పడిన బాధలను ఎదుర్కొన్న సవాళ్లను చెప్పుకొచ్చారు.

ఆమె వందలాది చిత్రాల్లో నటించారు.బాలనటిగా 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

ఇలా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.

అత్త, అమ్మ ,వదిన, అక్క, ఇలా చెప్పుకుంటూ పోతే కారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చేయని పాత్ర లేదు అని చెప్పాలి.

ఏ పాత్రలో నటించిన ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోసే వారు ఆమె.ఇక అన్ని పాత్రలతో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యారు .

ఇటీవలే ఆమె జీవితంలో పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు సుధా.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధ.

సినీ పరిశ్రమలో ఎంతో సంపాదించుకున్నాను .కానీ సంపాదించిన మొత్తాన్ని కూడా బిజినెస్ లో పెట్టి అంతా పోగొట్టుకున్నాను.

ఢిల్లీలో ఒక హోటల్ పెట్టినప్పుడు లాభాలు వచ్చాయి.దీంతో మరో హోటల్ కూడా స్టార్ట్ చేశాను.

కానీ కలిసి రాలేదు తీవ్రంగా నష్టాలు వచ్చి నిండా మునిగిపోయాను.ఆ తర్వాత కొన్ని రోజులు హైదరాబాద్ లో  ఉన్న నేను కుటుంబ సమస్యల కారణంగా చెన్నైకి మారాల్సి వచ్చింది.

"""/" / నా భర్త ,అబ్బాయి యూఎస్ లో నాకు దూరంగా ఉంటున్నారు.

అయితే చిన్నప్పుడు అమ్మ హార్ట్ ఎటాక్ తో  పోయింది నాకు అన్నదమ్ములు ఉన్న నాన్నకి మాత్రం ఎక్కడా తోడునీడగా నిలవలేదు.

దీంతో నాన్న బాధ్యత కూడా నేనే తీసుకున్నాను.నాన్నకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి.

కానీ క్యాన్సర్ కారణంగా అవి అన్ని కరిగిపోయాయి.అమ్మ పోయినప్పుడు అంత బాధ పడలేదు కానీ నాన్న పోయాక జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది.

ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను.ఇక ఇన్నేళ్ల జీవితంలో మనుషులను నమ్మకూడదు అని అర్థం చేసుకున్నా.

"""/" / సమస్య వచ్చినప్పుడు బంధువులంతా దూరం పెట్టారు.కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు.

ఇలా నా జీవితంలో ఎన్నో గుణ పాఠాలు నేర్చుకున్నా.మాతృదేవోభవ సినిమాలోని ఎన్నో ఘటనలు నా నిజ జీవితంలో నిజమయ్యాయి.

ఇలా పరిశ్రమలో బాగా పేరు సంపాదించుకొన్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను అంటూ తన చేదు అనుభవాలను ఇటీవల చెప్పుకొచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ.

Ravi Teja : ఒకప్పుడు రవితేజ ను అవమానించిన స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలని చూస్తున్నాడా..?