సినిమా అవకాశాలు వస్తున్న లెక్క చేయకుండా సిమ్రాన్ చేస్తున్న బిజినెస్ ఏంటి..?
TeluguStop.com
తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ దశాబ్దం పాటు కుర్రకారులో సెగలు పుట్టించిన బ్యూటీఫుల్ హీరోయిన్ సిమ్రాన్.
మోడలింగ్‌లో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్‌లో తొలుత సినిమాలు చేసి.అక్కడి నుంచి సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
అబ్బాయి గారి పెళ్లి మూవీతో తెలుగులోకి వచ్చిన సిమ్రాన్.మోడ్రన్, సంప్రదాయ దుస్తుల్లో తన అందచందాలను ఎదజల్లింది.
అనతి కాలంలోనే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి టాప్ హీరోలతో జోడీ కట్టింది.
టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది.ఆకట్టుకునే అందంతో పాటు ఏ క్యారెక్టర్‌లోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయడం సిమ్రన్ సొంతం.
అదే ఆమె సక్సెస్‌కు కారణం అయ్యింది.సుమారు దశాబ్దం పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది.
మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడైన దీపక్ బగ్గాను 2003లో వివాహం చేసుకుంది.
అనంతం పిల్లలు కావడంతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది.2008లో సిమ్రాన్ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఒక్క మగాడు, జాన్ అప్పారావ్, 40 ప్లస్ సినిమాల్లో నటించింది.అనంతరం తెలుగు, తమిళ టీవీ తెరనూ ఏలింది.
పలు సీరియళ్లలో నటించింది.టీవీ షోలూ చేసింది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.తమిళంతో పాటు అడపా,దడపా తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తోంది.
2018లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన పేటా సినిమాలో నటించింది.తాజాగా విలన్ పాత్రలు చేసేందుకు రెడీ అవుతోంది.
ఇద్దరు పిల్లల తల్లైనా తరగని అందాలతో దూసుకుపోతోంది సిమ్రాన్.మంచి హీరోలే విలన్లుగా నటిస్తున్నప్పుడు తానెందుకు చేయకూడదంటుంది ఈ బ్యూటీ.
తమిళ యువ హీరో శివకార్తికేయన్ మూవీలో మాంచి విలన్ క్యారెక్టర్ చేస్తోంది. """/"/
ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన భర్త దీపక్‌తో కలిసి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది సిమ్రాన్.
సిమ్రాన్ అండ్ సన్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసింది.ఈ సంస్థ ద్వారా రెండు మూవీ ప్రొడక్షన్స్ పనులు చేస్తోంది.
ఈ బాధ్యతలను తన భర్తకు అప్పగించింది.ఓవైపు సినిమాలు.
మరోవైపు వ్యాపారం చేస్తే ముందుకు వెళ్తోంది ఈ ముదురు భామ.
ఇదేక్కడి విడ్డూరం.. వైరుపై మేక మేత.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు!