సీరియల్ గా కూడా పనికిరాదు అంటూ రిజెక్ట్ చేసిన సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది
TeluguStop.com
కొన్నిసార్లు తొలుత రిజెక్ట్ చేసిన విషయాలే.ఆ తర్వాత ఎంతో సంచలనం సృష్టిస్తాయి.
అరే.అప్పుడు ఎందుకు వద్దనుకున్నామా? అని తీరిగ్గా బాధపడినా పెద్ద ప్రయోజనం ఉండదు.
సేమ్ ఇలాగే జరిగింది ఆ నలుగురు సినిమా విషయంలో.తొలుత ఈ కథ సీరియల్ కు కూడా పనికిరాదని చెప్పారు.
కానీ అదే స్టోరీ సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది.ఇక అసలు విషయానికి వస్తే.
మదనపల్లి సమీపంలోని కొత్తకోటలో జరిగిన ఓ సంఘటన దర్శకుడు మదన్ ని ఎంతో ఆవేదనకు గురి చేసింది.
ఊరంతా అప్పులు చేసిన వ్యక్తి అంతిమ క్రియలకు ప్రజలంతా కదిలి వచ్చి.ఆయన అప్పుల గురించి కాకుండా మంచి గురించి మాట్లాడుకోవడం ఎంతో ఆకట్టుకుంది.
ఇదే స్టోరీ లైన్ తీసుకుని కథ తయారు చేశాడు.డబ్బు కన్నా మానవతా విలువలు ప్రధానం అని చెప్పేలా స్టోరీ రాసుకున్నాడు.
దానికి అంతిమయాత్ర అనే పేరు పెట్టాడు. """/"/
ఈ స్టోరీతో సీరియల్ తియ్యొచ్చని ఈటీవీకి పంపించాడు.
వారు దాన్ని తిరస్కరించారు.అదే కథను కాస్త డెవలప్ చేసి భాగ్యరాజా దగ్గరకు తీసుకుపోయాడు.
ఆయన తెలుగు, తమిళ్ లో తానే తీస్తానని చెప్పాడు.ఈ సినిమాకు మోహన్ బాబు అయితే బాగుంటుందన్నాడు.
ఆ తర్వాత ఈ స్టోరీని ప్రకాష్ రాజుకు చెప్తే కథ బాగున్నా సినిమాగా పనికిరాదని చెప్పాడు.
ఇదే కథను తన మిత్రుడు డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్ కు వినిపించాడు.కథ నచ్చి.
తనే ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పాడు.ఆ తర్వాత ఈ కథను రాజేంద్ర ప్రసాద్ కు చెప్పారు.
ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.ఆయన కంట తడి పెట్టుకున్నాడు.
ఈ సినిమాలలో తాను నటిస్తానని చెప్పాడు.హీరోయిన్ గా ఆమని, సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ ఓకే అయ్యారు.
సినిమా టైటిల్ ను ఆ నలుగురు గా మార్చారు.ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది.
రాజేంద్ర ప్రసాద్ డైలాగులు ఆకట్టుకున్నాయి.ఈ చిత్రం ఎన్నో అవార్డులను దక్కించుకుంది.
నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!