హీరో సుమన్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారో మీకు తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ సినిమాలు అప్పట్లో బాగా ఆడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
అయితే, చాలా కాలం నుంచి సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు.జీనియర్ డైరెక్టర్ శంకర్ -సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేసిన సుమన్.
ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తున్నారు.కాగా, సుమన్ తన కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడూ చెప్పలేదు.
తాజాగా ఆ విషయాలు మీడియాకు ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు.వీవీ నరసరాజు అనే రైటర్ మనవరాలు శిరీష తన వైఫ్ అని పేర్కొన్న సుమన్, ఆమె హౌజ్ వైఫ్ అని చెప్పారు.
ఇక తన కూతురు ఎంఎస్సీ ఫినిష్ చేసిందని, కరోనా వల్ల రెండేళ్లుగా ఖాళీగానే ఉందని పేర్కొన్నాడు.
పై చదువులు చదివేందుకుగాను ఆమె ఇంకా ఇంట్రెస్టెడ్‌గానే ఉందన్నారు.ఇకపోతే ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుందని, అరంగేట్రం చేసిందని వివరించారు.
తన కూతురుకు సినిమాల్లోకి రావడం అంతగా ఇంట్రెస్ట్ లేదని అన్నారు.తన కూతురు సినిమాల్లోకి వస్తే ఓకేనని, కాని ఆమెకు ఆసక్తి లేనప్పుడు నేను ఫోర్స్ చేయబోనని చెప్పారు.
మణిపాల్ యూనివర్సిటీలో తన కూతురు గోల్డ్ మెడల్ సాధించిందని, ఈ క్రమంలోనే తాను చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆమెను చదివించడానికే తాను సిద్ధంగా ఉన్నానని సుమన్ పేర్కొన్నారు.
"""/"/
ఈ నేపథ్యంలోనే సుమన్ మాట్లాడుతూ తాను 1989లో చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యానని చెప్పారు.
అలా షిఫ్ట్ అయిన సినీ ప్రముఖులలో తానే మొదటివాడినని పేర్కొన్నారు.హైదరాబాద్ నుంచే షూటింగ్‌ల కోసం తాను బెంగళూరు, చెన్నయ్, కేరళకు వెళ్తానని సుమన్ తెలిపాడు.
ఇకపోతే సుమన్ అప్పట్లో చాలా చిత్రాల్లో అందంగా కనిపించేవాడని ప్రేక్షకులు ఇప్పటికీ చర్చించుకుంటారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘అన్నమయ్య’ చిత్రంలో శ్రీవెంకటేశ్వరుడి పాత్రను సుమన్ పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన సంగతి అందరికీ విదితమే.
సుమన్ మలయాళం సినిమాల్లోనూ విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…