ఇండియా కూటమిలో ఐక్యత కష్టమే !

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని( BJP Party ) గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కూటమిలో ఎన్నికల స్ట్రాటజీ, తదుపరి కార్యాచరణ వంటి వాటిపై అధినేతలు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు.

కూటమిలో కాంగ్రెస్ తో పాటు జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

అయితే ఐక్యతే ప్రధాన ఎజెండాగా ఏర్పడిన ఇండియా కూటమిలో ఐక్యత కరువయ్యేలాగే కనిపిస్తోంది.

కూటమిగా ఏర్పడిన కొద్ది రోజులకే పార్టీల మద్య ఆయా విషయాల్లో విభేదాలు పెరుగుతున్నాయి.

"""/" / ముఖ్యంగా సీట్ల పంపకాలు, పి‌ఎం అభ్యర్థి వాటి వాటిపై పోటీ వాతావరణం నెలకొన్నాట్లు కనిపిస్తోంది.

తాజాగా డిల్లీ లోక్ సభ స్థానాలకు సంబంధించి ఆప్ మరియు కాంగ్రెస్ మద్య అగ్గి రాజుకుంటోంది.

డిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) తమ అభ్యర్థులను నియమిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది.ఇండియా కూటమితో ఆప్ పొత్తులో ఉన్న కారణంగా సీట్ల విషయంలో కాంగ్రెస్ కు సహకరిస్తుందని హస్తం నేతలు భావించారు.

కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఎలాంటి సంప్రదింపులు జరపకుండా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

"""/" / ఇక ఆయా ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలలో కూడా మిత్రా పక్ష పార్టీలతో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక పి‌ఎం అభ్యర్థి విషయంలో ఇంతవరుకు ఎలాంటి స్పష్టత లేదు.ఇండియా కూటమి తరుపున రాహుల్ గాంధీని ( Rahul Gandhi )పి‌ఎం అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికి ఇతర పార్టీల నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు లభించడం లేదట.

ముఖ్యంతా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తాను ప్రధాని అభ్యర్థిగా ఉండాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఐక్యంగా బీజేపీని ఎదుర్కోవలని భావిస్తున్నప్పటికీ.విపక్ష కూటమిలో ఐక్యత కష్టమే అనే భావన కలుగుతోంది.

దాంతో ఇండియా కూటమిని అటు బీజేపీ కూడా లైట్ తీసుకుంటోంది.

ప్రభాస్ హను రాఘవపూడి కాంబో సినిమాలో హీరోయిన్ ఈమే.. ఈ లక్కీ బ్యూటీ ఎవరంటే?