అల్లూరి సీతారామరాజు కు ఘనంగా నివాళులర్పించిన కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి.. రోజా
TeluguStop.com
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు విశాఖలో ఘనంగా నివాళులర్పించారు.
పార్క్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
అల్లూరు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత భవిష్యత్తు నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు అల్లూరి స్ఫూర్తిగా ఈ రోజు నుంచి ఏడాది కాలం స్మారక కార్యక్రమాలు చేపడతామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు
మరోవైపు అల్లూరి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా పేర్కొన్నారు.
అల్లూరి పేరిట జిల్లా ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు.ఆయన మనస్ఫూర్తిగా కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో 33 ఎకరాల్లో స్మారక పార్కు ఏర్పాటు చేసినట్టు రోజా ప్రకటించారు.
పార్క్ హోటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఎమ్మెల్సీ కల్యాణి తో పాటు పలువురు ప్రముఖులు అల్లూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ట్రక్కుతో వైట్‌హౌస్‌లో విధ్వంసానికి కుట్ర .. తెలుగు యువకుడికి జైలు శిక్ష