భారత సంతతి సీఈవోలతో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ భేటీ.. !!
TeluguStop.com
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్( Union Minister Piyush Goyal ) న్యూయార్క్‌లో( New York ) భారత సంతతికి చెందిన యువ సీఈవోలు , వ్యవస్థాపకులతో సమావేశమయ్యారు.
గడిచిన దశాబ్ధకాలంలో భారతదేశ వృద్ధికి కారణమైన మోడీ సంస్కరణలను ఆయన ప్రస్తావించారు.ఈ మేరకు సమావేశ వివరాలను పీయూష్ గోయెల్ ఎక్స్‌లో షేర్ చేశారు.
న్యూయార్క్‌లో భారత సంతతికి చెందిన యువ సీఈవోలు, వ్యవస్థాపకులతో చర్చలు బాగా జరిగాయన్నారు.
తయారీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సుస్థిర సాంకేతికత వంటి రంగాలలో భారత్ నిబద్ధతను పీయూష్ పునరుద్ఘాటించారు.
మేక్ ఇన్ ఇండియాలో( Make In India ) భాగస్వాములు కావాల్సిందిగా ఆయన వారిని ఆహ్వానించారు.
అలాగే ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్( Amneal Pharma ) కో సీఈవోలు చింటూ పటేల్, ఆమ్నీల్ పటేల్‌తోనూ పీయూష్ సమావేశమయ్యారు.
భారత ఫార్మాస్యూటికల్ ఎకోసిస్టమ్‌ను ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని కేంద్ర మంత్రి సూచించారు. """/" /
కాగా.
కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( S Jaishankar ) కూడా అమెరికాలోనే ఉన్నారు.
యూఎస్ పర్యటనలో భాగంగా అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోతో( Gina Raimondo ) ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, ఇరు దేశాల పెట్టుబడుల సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై ఆయన చర్చలు జరిపారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన జైశంకర్.యూఎస్ కేబినెట్ ర్యాంక్ అధికారులను కలవనున్నారు.
"""/" /
అమెరికా పర్యటనకు సంబంధించి ఒక ఎక్స్‌పోస్ట్‌లో జైశంకర్ ఇలా రాసుకొచ్చారు.
తాము సెమీ కండక్టర్స్, ఐసీఈటీ, క్లిష్టమైన ఖనిజాలు, విశ్వసనీయ భాగస్వామ్యాలు, సప్లై చైన్ వంటి వాటిపై చర్చలు జరిపినట్లు వివరించారు.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, కేంద్ర వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కార్యక్రమాలు యూఎస్ - ఇండియా వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
పీయూష్ గోయల్, జైశంకర్‌ల అమెరికా పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.
ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ వైరల్!