పీ హెచ్ సీని ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీ హెచ్ సీ) శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

రూ.1 కోటి 56 లక్షలతో పీ హెచ్ సీ భవనాన్ని నిర్మించగా, ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.దవాఖాన ఆవరణ, ఇన్ పేషెంట్ గదులు, ఓపీ గదిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బీపీ చెక్ చేశారు.

ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, మెడికల్ ఆఫీసర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.

ఛీ, రైలు టాయిలెట్‌లో టీ పాత్రలు కడుగుతున్నాడుగా.. వీడియో చూస్తే వాంతి చేసుకుంటారు!