గోదావరి జిల్లాల్లో తాగునీరు లేకపోవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి
TeluguStop.com
గోదావరి జిల్లాల్లో తాగునీరు లేకపోవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో రక్షిత తాగునీటి పదకాన్ని ఆమె ప్రారంభించారు.
సమీప గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడం పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఆరేళ్ల క్రితమే సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేశామని.ఇప్పటికీ మంచినీటి సౌకర్యం కల్పించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
మత్స్య గ్రామం లో ఏర్పాటు చేసినట్టు మిగతా ఆరు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించక పోవడం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు .
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎదుటే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను నిలదీయాలని ప్రజలకు సూచించారు.