ఏపీ సీఎం జగన్ తో కేంద్ర మంత్రి భేటీ..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ( Mansukh Mandaviya ) భేటీ అయ్యారు.
శుక్రవారం జగన్( CM Jagan ) నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య సేవలపై ఇద్దరు చర్చించుకోవడం జరిగింది.అంతకుముందు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, జిఎస్ఎల్ 3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
కొత్తగా ₹1.25 కోట్లతో నిర్మించిన ఐసిహెచ్ ఎల్ ల్యాబ్స్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరును ప్రశంసించడం జరిగింది.ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని స్పష్టం చేయడం జరిగింది.
"""/" /
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ( PM Modi ) హెల్త్ సెక్టార్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు పేర్కొన్నారు.
గత తొమ్మిది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 350కి పైగా కొత్త మెడికల్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం నిర్మించినట్లు స్పష్టం చేశారు.
వైద్య పరంగా కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో చేసిన అనేక మంచి పనులు గురించి కూడా వివరించారు.
ఏపీ ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించడం.అభినందనీయమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మరియు ఆరోగ్య మంత్రి విడుదల రజినికి.కేంద్రమంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అనంతరం సాయంత్రం సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది.
చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..