టీఆర్ఎస్ నేతలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో జేపీ నడ్డా సమాధి వ్యవహారంపై బీజేపీ మండిపడుతోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆరోపణలు, వికృత శేష్ఠలకు హద్దు ఉండాలని చెప్పారు.

ఉన్మాదానికి కూడా ఒక అవధి ఉంటుందన్నారు.తమ సహనాన్ని అసమర్ధతగా భావించ వద్దని సూచించారు.

తాము కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేయడం లేదన్న ఆయన.దేశం కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

మేము తెగిస్తే టీఆర్ఎస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.జేపీ సమాధి విషయంలో టీఆర్ఎస్ ప్రమేయం ఉందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సిరి ధాన్యం ధ‌ర త‌క్కువ‌.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎక్కువ‌..!