ఎన్నికల ప్రచారంలో ఎన్ని సిత్రాలో.. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఇలా.. ?

ఎన్నికలు వచ్చాయంటే చాలు అప్పటి వరకు ప్రజలను పట్టించుకోని నేతలు కూడా ప్రజల్లో ఒకరిగా కలిసిపోతారు.

అంతే కాదు వారు చేస్తున్న ప్రచారంలో ఎన్నో సిత్రాలను ప్రదర్శిస్తారు.దోశలు వేస్తూ ఒకరు, చీపురు పట్టి ఒకరు, బట్టలు, గిన్నెలు, ఇస్త్రీ చేస్తూ, ఇలా రకరకాలైన విన్యాసాలను ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రదర్శిస్తారు.

ఇదే కోవలో ప్రయాణిస్తున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇకపోతే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి ఇరానీ, తమ పార్టీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్‌ను గెలిపించాలని కోరుతూ, ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా దాండియా ఆడారు.

ఇక తమిళనాడులో ఒకే విడుతలో 234 సీట్లకు, ఏప్రిల్‌ 6న పోలింగ్ జరుగుతుండగా, మే 2న ఫలితాలు వెల్లడిస్తున్నారట.

కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,‌ డీఎంకే కూటమి, బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.

అద్భుతమైన ఈ మొక్క.. ఎక్కడ కనిపించినా వదలకండి..!