ఏపీ రాజధాని ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

కేంద్రమంత్రి అథవాలే ఏపీ మూడు రాజధానులు అంశం కేంద్ర పరిధిలో లేదని స్పష్టం చేశారు.

ఇక ఇదే తరుణంలో ఎన్డీఏ లో వైసీపీ పార్టీ చేరాలని కూడా స్పష్టం చేశారు.

దేశంలో పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ హాయం నుండే స్టార్ట్ అయింది అని పేర్కొన్నారు.

ఇదే తరుణంలో రాష్ట్రంలో ప్రాజెక్టులు.రహదారులు కూడా పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

 ఇదిలా ఉంటే 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించాక అమరావతి రాజధానిగా ప్రకటించడం తెలిసిందే.

అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ తెరపైకి సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చి.

వైజాగ్, కర్నూల్ కి.రాజధానిని తరలించడం జరిగింది.

పరిపాలన రాజధానిగా వైజాగ్.నీ.

న్యాయశాఖ రాజధానిగా కర్నూలును గుర్తించారు.ఒకే చోట అభివృద్ధి జరిగితే గతంలో మాదిరిగా అనగా హైదరాబాద్ నగరంలోని అభివృద్ధి జరగటంతో విభజన జరిగాక ఏపీ చాలా నష్టపోయిందని అమరావతి అభివృద్ధి జరిగితే మిగతా ప్రాంతాల్లో కూడా నష్టపోతాయని వైసిపి మూడు రాజధానులు నినాదాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది.

ఇటువంటి తరుణంలో వైసీపీ మూడు రాజధానులు కాన్సెప్ట్ నీ.జనసేన పార్టీ అదే రీతిలో టీడీపీ ఇంకా పలు పార్టీలు వ్యతిరేకించటం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని రాందాస్ అథవాలే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్ కౌర్.. అసలేం జరిగిందంటే?