విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం జరగనుంది.కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు భేటీ కానున్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్‌ సహా వివిధశాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

సమావేశం అజెండాలో పొందుపరిచిన మొత్తం 14 అంశాలపై చర్చించనున్నారు.విభజన చట్టం షెడ్యూల్‌ 9 లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.

కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్‌ రైల్‌ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ ఎజెండాలో పొందుపరిచింది.