ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు సందర్శించడానికి వచ్చిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (
Bandi Sanjay Kumar )ను కలిసిన బిజెపి పార్టీ( BJP Party ) నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు.
ఈ సందర్భంగా నాయకులు ఎల్లారెడ్డిపేట మండలం లో ఉన్నటువంటి పలు సమస్యలపై వినతిపత్రం రూపంలో అందించారని తెలిపారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు.
ప్రజల నుంచి వచ్చిన అభివృద్ధి పత్రాలను స్వీకరించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మండలంలోని వివిధ గ్రామాలలో కావలసిన అభివృద్ధి పనుల గురించి నిధులు మంజూరు చేయాలని, మరి కొందరు తమ సంఘం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్ ని కోరారు.
బండి సంజయ్ ని కలిసిన వారిలో ఎల్లారెడ్డిపేట బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, బీజేపీ టౌన్ అధ్యక్షులు నంది నరేష్, పారిపల్లి సంజీవరెడ్డి,మానుక కుమార్ యాదవ్ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!