తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
TeluguStop.com
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే ఆయన రాష్ట్రానికి రానున్నారు.
ఈనెల 16 వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు.
అక్కడి నుంచి సీఆర్ఫీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్లనున్న ఆయన పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.
ఇందులో భాగంగా త్వరలో రానున్న ఎన్నికలపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.అనంతరం 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఉత్సవాలు ముగిసిన అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.కాగా సెప్టెంబర్ 17న కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
డ్యాన్స్ లో టాలీవుడ్ నంబర్ హీరో అతనేనా.. చరణ్, బన్నీ, తారక్ లలో ఎవరంటే?