మునుగోడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
TeluguStop.com
తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు.మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.
ఈ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.ముందుగా అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ వెళ్లి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేటలోని రమదా మనోహర్ హోటల్ లో రైతు ప్రతినిధులతో సమావేశం అవుతారు.
అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్ లో మునుగోడుకు చేరుకుంటారు.సాయంత్రం సీఆర్ఫీఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.
మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఇది హైలెట్ అవ్వబోతుందా..?