Amit Shah : రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!
TeluguStop.com
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) రేపు తెలంగాణకు రానున్నారు.
పర్యటనలో భాగంగా రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో( LB Stadium, Hyderabad) బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
కాగా రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు.
అక్కడి నుంచి నేరుగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి ( Bhagyalakshmi Temple )వెళ్లనున్నారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమిత్ షా ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంకు వెళ్లనున్న ఆయన సుమారు 62 వేల మంది బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం అవుతారు.
తరువాత పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జులతో సమావేశం కానున్నారు.అమిత్ షా రాక నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్రివిక్రమ్ కి సలహాలు ఇస్తున్న అల్లు అర్జున్…కథ మారిపోయిందా..?