తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi ) నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్ తెలిపారు.

ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్( SP Singh Baghel ) కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో, వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల స్వీయ నియంత్రణతో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…