కరోనా బారిన పడ్డ కేంద్ర ఆయూష్ మంత్రి శ్రీపాద్ వై నాయక్..!

ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడగా.తాజాగా కేంద్ర ఆయూష్ సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్‎కు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయింది.

ఎలాంటి లక్షణాలు లేకున్నా బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‎గా రిపోర్టు వచ్చినట్టు ఆయూష్ సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తనకు ఎలాంటి కరోనా లక్షణాలు గానీ, అనారోగ్య సమస్యలు గానీ లేవని స్పష్టం చేశారు.

కరోనా పాజిటివ్ రావడంతో తాను హోం ఐసోలేషన్‎లో ఉన్నానంటూ ట్వీట్టర్‎లో పేర్కొన్నారు.గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని.

అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీపాద్ వై నాయక్ సూచించారు.కాగా, ఇప్పటివరకు హోం మంత్రి అమిత్ షాతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులు కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి