ట్రూ కాలర్ అన్ఇన్‌స్టాల్ చేసినప్పటికీ సమస్య తీరడంలేదా? అయితే ఇలా చేయండి!

ట్రూ కాలర్ అన్ఇన్‌స్టాల్ చేసినప్పటికీ సమస్య తీరడంలేదా? అయితే ఇలా చేయండి!

స్మార్ట్‌ఫోన్‌ ( Smart Phone )వాడేవారికి ట్రూ కాలర్ యాప్( True Caller App ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ట్రూ కాలర్ అన్ఇన్‌స్టాల్ చేసినప్పటికీ సమస్య తీరడంలేదా? అయితే ఇలా చేయండి!

ముఖ్యంగా యువత ఈ యాప్‌ను ఎక్కువగా ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.మన కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే సులభంగా ఎవరో? తెలుసుకోవడానికి వీలుగా ఉండడంతో ఈ యాప్‌కు మంచి క్రేజ్ పెరిగింది.

ట్రూ కాలర్ అన్ఇన్‌స్టాల్ చేసినప్పటికీ సమస్య తీరడంలేదా? అయితే ఇలా చేయండి!

అందుకే దీనిని అందరూ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.వినియోగదారులు స్పామ్ కాల్స్‌ను సులభంగా గుర్తించేలా ఉండడంతో ఈ యాప్‌ను చాలా మంది విరివిగా వాడడం జరుగుతోంది.

అయితే ఈ యాప్ వల్ల ఎంతటి లాభాలున్నా అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు గత కొంతకాలంగా హెచ్చరిస్తున్న విషయం విదితమే.

"""/" / ముఖ్యంగా దీనివలన వ్యక్తిగత గోప్యతా వివరాలు ప్రతి ఒక్కరికీ వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ క్రమంలోనే చాలామంది ఆందోళన చెందుతున్నారు.కొంతమంది వినియోగదారులు యాప్ డేటాబేస్ నుంచి నంబర్‌ను తీసేయడం ఎలా? అని ఆందోళన చెందుతూ ఉంటారు.

అలాంటివారు ముందుగా ఫోన్‌లో ట్రూ కాలర్ యాప్‌ను తెరిచి యాప్ పై భాగంలో ఎడమ వైపు ఉన్న వ్యక్తుల చిహ్నాన్ని టచ్ చేస్తే మీకు సెట్టింగ్స్ పేజీ కనబడుతుంది.

దానిని ఓపెన్ చేసి ప్రైవసీ పేజీని ఎంచుకోవాలి.అక్కడ డీ యాక్టివేట్ ఎంపికపై క్లిక్ చేస్తే మీకు ఓ పాప్ అప్ కనిపిస్తుంది.

ఇపుడు ఖాతాను మీ ప్రొఫైల్ డేటాను తొలగించవచ్చు. """/" / అదేవిధంగా అక్కడ మీ కాంటాక్ట్‌ను అన్‌లిస్ట్ చేసుకోవచ్చు.

ట్రూకాలర్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత ట్రూకాలర్ అన్‌లిట్ ఫోన్ నెంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

మీ నెంబర్‌కు +91 జోడించి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.తరువాత నేను రోబోట్‌ను కాదు అని ధ్రువీకరించాల్సి ఉంటుంది.

ఇపుడు అన్‌లిస్ట్ చేయడానికి గల కారణాలలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.కారణాన్ని ఎంటర్ చేసిన తర్వాత ధ్రువీకరణ క్యాప్చాను ఎంటర్ చేసి అన్‌లిస్ట్ ఎంపికపై క్లిక్ చేస్తే సరిపోతుంది.

డేటా బేస్ నుంచి నెంబర్ తీసేయడానికి 24 గంటల సమయం పడుతుంది.