ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి ఊహించని షాక్.. ??

దుబ్బాక ఎన్నికల దగ్గరి నుండి వ్యతిరేక పవనాలను అందుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ, జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కుడా కాస్త తడబడ్ద విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరులో ఎలాంటి ఫలాలను అందుకుంటుందో తెలియదు గానీ, తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మాత్రం చాలా హీట్ మీద సాగుతున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

నిజానికి ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తాయి.కానీ పల్లా విషయంలో సొంత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది.

కాగా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ప్రస్తుతం వరకు ఏనాడూ నియోజకవర్గ పట్టభద్రులకు కన్పించిన దాఖాలాల్లేవు.

నిరుద్యోగ సమస్యను ఏనాడూ మండలిలో గానీ ప్రభుత్వం దృష్టికి గానీ తీసుకెళ్లిన సందర్భాలూ లేవు.

దీంతో నిరుద్యోగుల నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈసారి భంగపాటు తప్పదని ప్రచారం జరుగుతుంది.

ఇందువల్లనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా తరపున ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందట.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై సంచలన తీర్పు