చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాటకు అనూహ్య స్పందన..
TeluguStop.com
అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో.
మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
సూర్య శ్రీనివాస్, పవన్ కేసి, రూపిక, ఇందు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాను లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు కుంచం శంకర్ తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన చిల్ బ్రో పబ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్షకులు నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో పముఖ గాయని మంగ్లీ పాడిన బొడ్రాయి అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేశారు.
మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెరసీ ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.
ఓరి మీ దుంపతెగ.. అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా.. (వీడియో)