సిగరేట్, మద్యం మాత్రమే కాదు .. ఈ అలవాట్లు కూడా కిడ్నిలకు ప్రమాదం

కిడ్నీలు ఒక్కసారిగా చెడిపోవు.అవి చెడిపోవాలంటే, వాటికి హాని చేసే అలవాటు ఉండాల్సిందే.

అలవాటు, వ్యసనం .ఈ పదాలు వింటే మనకి మొదట సిగరేట్ లేదా మద్యం గుర్తుకువస్తాయి.

కిడ్నీలకు హాని చేసే అలవాట్లే ఇవి.కాని ఇవి మాత్రమే కారణం కావు.

అందుకే ధూమపానం, మద్యపానం అలవాట్లు లేనివారికి కూడా కిడ్నీల్లో సమస్యలు వస్తాయి.ఎందుకంటే, కిడ్నిలను పాడు చేసే అలవాట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి.

ఈ అలవాట్లు మనకి అంతగా ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు కాని, ఇవి సైలెంట్ గా చేయాల్సిన హాని చేసేస్తాయి.

మరి అవేంటో చూడండి.ఏదో పనిలో ఉన్నారు.

ఇంతలో మూత్రం వస్తున్నట్లు అనిపించింది.అప్పుడు చాలామంది మూత్ర విసర్జన చేయకుండా, దాన్ని ఆపి ఉంచుతారు.

ఇక తట్టుకోవడం కష్టం అని అనిపించేదాకా అపి, అప్పుడు విసర్జన చేస్తారు.ఇది చాలా చెడ్డ అలవాటు.

దీన్ని వలన మలినాలు వెనక్కిపోవచ్చు, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడవచ్చు.పచ్చిగా చెప్పాలంటే, కిడ్నీలు మనం తాగే నీటిమీద, ఇతర ద్రవపదార్థాల మీద ఆధారపడి ఉంటాయి.

మనం నీళ్ళు బాగా తాగితే తప్ప టాక్సిన్స్ బయటకిపోవు.టాక్సిన్స్ బయటకిపోతే తప్ప, కిడ్నిలు శుభ్రంగా ఉండవు.

కొందరు మంచినీళ్ళు సరిగా తాగరు.ఇది కూడా ఒక బ్యాడ్ హాబిట్.

మీ కిడ్నీలను అనేక సమస్యలకు గురిచేస్తుంది ఈ అలవాటు.!--nextpage ఇంట్లో వండిన కూర ఒకటే.

కాని ఇంట్లో ఒకరికి మాత్రమే అందులో ఉప్పు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే? కొందరికి ఈ అలవాటు ఉంటుంది.

ఉప్పు బాగా తింటారు.దీంతో శరీరంలోకి సోడియం బాగా చేరుతుంది.

సోడియం ఒంట్లోకి ఎక్కువగా వెళ్ళింది అంటే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే.అందుకే ఉప్పు లిమిట్ గా తీసుకోవాలి.

కూరలో తక్కువ వేసుకున్నంత మాత్రానా సరిపోదు, ఉప్పు ఉన్న పిండివంటకాలు ఎక్కువ తినకూడదు.

డాక్టర్ ఒక మందు రాస్తే, దాన్ని ఎప్పటిదాకా, ఎలా వాడమన్నాడో, అలానే వాడాలి.

టాబ్లేట్స్ ఇష్టంవచ్చినట్లు వాడటం మీ కిడ్నీలకు మంచిది కాదు.ఇబుప్రొఫెన్, ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్, ఇంకా కొన్నిరకాల యాంటిబయోటిక్స్ అతిగా తీసుకుంటే మీ కిడ్నీలను మీరే నాశనం చేసుకుంటున్నట్లు.

డయాబెటిస్ వచ్చేంతగా స్వీట్స్ తినడం, వ్యాయామం తప్పడం లేక చేసే అలవాటు లేకపోవడం, బ్లడ్ ప్రెషర్ ని కంట్లోల్ లో ఉంచుకోకపోవడం, చివరకి టమోటాలు, ఆరెంజ్, ఆలు గడ్డ, మాంసం కూడా టూ మచ్ గా తినటం కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించినంతవరకు మంచి అలవాట్లు కావు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేరళ ఎన్ఆర్ఐల క్యూ.. పార్టీల ప్రత్యేక ఏర్పాట్లు