నీతి లేని నేతలు.. దిగజారిన రాజకీయాలు

రోజురోజుకూ రాజకీయాలు దిగజారుతున్నాయి.నేతలు నీతి తప్పుతున్నారు.

రాజకీయాలలో నాటి విలువలు నేడు కానరావడం లేదు.అవినీతి అధికారంతో పెనవేసుకుని పెత్తనం చెలాయిస్తూ ది.

ప్రజలు అధికార అనధికార రాజకీయ చదరంగంలో పావులై పోతున్నారు.ప్రజల్ని మనుషులుగా గా కాక కేవలం ఓటర్లుగా చూడటం మొదలైంది.

బహుశా ఇప్పుడు దేశ మంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పవచ్చు.క్వాటర్ కి ఓటరు కింద లెక్క గట్టి నేతలు తమ పబ్బం గడుపుకుంటున్నారు.

ప్రజాస్వామ్యంలో విలువలను వదులుతున్నారు.పంచుకో పెంచుకో అనే చందానం డబ్బుని విచ్చలవిడిగా ప్రజలపై వెదజల్లి తిరిగి ఆ ధనాన్ని అక్రమంగా సంపాదిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక రాజకీయాలలో అత్యంత దిగజారుడుతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.అధికారం అటు ప్రతిపక్షాలు ఎవరికి తోచిన విధంగా వారు ఓటర్లని ఏదో విధంగా ప్రలోభ పెడుతున్నారు.

మద్యం ఏరులై పడుతుంది.అవినీతి సంపాదన అక్రమార్జన మునుగోడును ముంచేస్తుంది.

ధనమే ప్రధాన అంశంగా మారింది అక్కడ.అధికారం కోసం ఎంతటి నీ చానికైనా దిగజారుటకు సిద్ధమైనాయి అన్ని పార్టీలు.

ప్రజలను తాగుబోతులుగా తిండిపోతులుగా తయారు చేస్తున్నారు.దాదాపుగా నెల రోజులుగా మద్య మాంసాధులతో విందు వినోదాలతో మునుగోడు ప్రజలు మునిగితేలుతున్నారు.

అటు అధికారం ఇటు ప్రతిపక్షం ఇద్దరూ ఎవరికీ తోచిన లెక్కన వారు జనాన్ని ఆకర్షించే పధకాలు రచిస్తున్నారు.

ఉచిత ఉచితాలు ఉచ్చ నీచాలు మరిచి ప్రజలను తమవంతుగా ప్రలోభ పెడుతున్నారు.ఒక ఉప ఎన్నికకి వందలాది కోట్ల భారీ ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారు.

ఈ సొమ్మంతా తిరిగి ప్రజల నుంచి వసూలు చేస్తారు.రాజకీయాలు ఎంతకు దిగజారాయో మునుగోడు చిత్రం చూస్తే అర్థమవుతుంది.

ఒక ఎమ్మెల్యే సీటు కొరకు ఇటు అధికార తెరాస అంటూ బిజెపి మరియు కాంగ్రెస్ తమ విశ్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్నాయి.

ఓటర్లకు వెండి బంగారం కట్నకానుకలు ధన కనక వస్తు వాహనాలు విచ్చలవిడిగా పంచి పెడుతున్నాయి.

మధ్య మాంసాధులతో ప్రజలను ముంచెత్తుతున్నాయి.అవినీతి సారా రూపంలో ఏరులైపారుతుంది మునుగోడులో.

ప్రజలు రాజకీయ మైకంలో మత్తులో పడి చిత్తుగా ఓడిపోతున్నారు.ప్రజాస్వామ్యం విలువలు కోల్పోయి విలవిలా ఏడుస్తుంది.

అడుగడుగునా అక్రమ ధనం ప్రవహిస్తూ ప్రజల్ని లోబరుస్తుంది.రాష్ట్రం మొత్తం మునుగొడు మీదనే దృష్టి సారించింది.

అధికార పార్టీ లోనీ నేతలంతా దాదాపుగా ప్రచార అర్భాటంలో పాల్గొని ప్రసంగించారు.తమవంతుగా ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు.

కొందరు మంత్రులు ఏకంగా ఓటర్లకు మందు పోస్తూ అడ్డంగా దొరికిపోయిన సందర్భాన్ని ప్రజలు గమనించారు.

అసలు ఇంతకు ఇది కేవలం ఒక ఉప ఎన్నికలా లేక యావత్ రాష్ట్రానికి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలా అనే విధంగా తయారయింది మునుగొడు పరిస్థితి.

యువకులని మహిళలని సైతం నేతలు తమకు అనుకూలం గా మార్చుకునేందుకు మద్యానికి బానిసలను చేస్తున్నారు.

"""/"/ ఇదంతా కేవలం వాళ్ళ పబ్బమ్ గడుపుకునేందుకు అనే విషయం తెలియని అమాయక ప్రజలు వాళ్ళ ప్రలోభాలకు లొంగుతున్నారు.

ఆరోగ్యం పై శ్రద్ధ లేకుండా నేతలు పంచే మందుకు విందుకు హాజరై తమని తాము నైతికంగా దిగజార్చుకుని పతనం అంచున పయనిస్తున్నారు.

ఇప్పుడు అలోచించ వలసింది దిగజారిన రాజకీయాల గురించా? విలువలు కోల్పోతున్న సమాజని కొరకా? ఏది ఏమైనా ప్రజలు కూడ అవినీతి అక్రమాలను అరికట్టే చర్యల్లో భాగం కావాలి.

వారిలో కూడా చేతన్యం రావాలి.ఉచితంగా పంపిణీ చేసే డబ్బు కోసం మద్యం కొసం తమని తాము నైతికంగా పతనం చేసుకోడం తప్పని గ్రహించాలి.

తమని తాగుబోతులను సోమరులను చేస్తున్న నేతలను ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలి.

తమకు ఉపాధిని కల్పించే వారికే ఓటేసి గెలిపించాలని.ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న చేసిన వారినే గెలిపించాలని.

స్వార్థానికి పాకులాడే నేతలను ,అక్రమార్జనకు అవినీతికి పాల్పడిన వారిని ఓడించి ఓటులో పవరుని ఓటరులో శక్తిని సమాజానికి దేశానికి చాటి చెప్పాలి.

దిగజారుతున్న రాజకీయ బురదలో పవిత్ర కమలంలా ప్రజలు నిత్యం వికసించాలి.