భారతీయ భాషకు అరుదైన గుర్తింపునిచ్చిన యునెస్కో..ఏకంగా...

ప్రపంచ వారసత్వ ప్రదేశం ( UNESCO) అరుదైన ప్రాంతాలు, అరుదైన బాషలు, అరుదైన ప్రదేశాలు, ఇలా వారసత్వంగా వచ్చే అన్ని వస్తువులను, ప్రదేశాలను వారసత్వ సంపద జాబితాలోకి తీసుకువెళ్ళి గుర్తింపునిస్తుంది UNESCO.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ సంస్థ నిర్ణయించబడిన వాటిని గౌరవిస్తాయి.

ఏదైనా కనుగొనబడిన వస్తవు లేదా, ప్రాంతాన్ని అక్కడి పరిస్థితుల ద్వారా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశోధించి దానిని వారసత్వ సంపదగా గుర్తించి తమ వెబ్సైటు నందు ఆ ప్రాంతానికి చెందిన వివరాలను పొందుపరుస్తారు.

భారత దేశంలో ఎన్నో కట్టడాలను యోనేస్కో తన జాబితాలో నమోదు చేసింది.ఐక్య రాజ్య సమితిలో అత్యంత కీలకమైన సంస్థ యునెస్కో.

1945 లో ఈ సంస్థని ప్రారంభించారు.దీని ప్రధాన లక్ష్యం వారసత్వ సంపదలను గుర్తించడం, వాటికి రక్షణ కల్పించేలా అతర్జాతీయ స్థాయిలో స్థానిక ప్రభుత్వాల తో వాటిని రక్షింపబడేలా చేయడం.

అంతేకాదు విద్యా, వైద్యం, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఎంతగానో శ్రమిస్తుంది.ఈ క్రమంలోనే భారత దేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ బాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేవిధంగా కీలక నిర్ణయం తీసుకుంది.

భారత దేశంలో తాము గుర్తించి తన వెబ్ సైట్ నందు పొందుపరిచిన ప్రాంతాలను ఇకపై హిందీలో సవివరంగా ఉంచుతామని, ఇది భారతీయ బాషకు తాము ఇచ్చే గౌరవమని పేర్కొంది.

అంతేకాదు జనవరి 10 హిందీ బాషా దినోత్సవం సందర్భంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనేస్కో లో భారత్ తరుపున శాశ్వత ప్రతినిధిగా ఉన్న విశాల్ శర్మకు తెలియజేసింది.

అంటే ఇకపై భారత్ లో వారసత్వ కట్టడాల వివరాలు ఇకపై హిందీలో ఉండబోతున్నాయని ప్రకటించింది.

యునెస్కో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు.

యునెస్కో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఈ గుర్తింపుతో హిందీ బాషకు మరింత ప్రాముఖ్యత కలుగుతుందని అన్నారు.

ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!!