కేసీఆర్ కు తాకిన నిరుద్యోగుల నిరసన సెగ...అందుకే ఆ ప్రకటన

టీఆర్ఎస్ ప్రభత్వానికి గత కొద్ది కాలంగా గడ్డు కాలం నడుస్తోంది.దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ ఎన్నికలో స్థానాలు కోల్పోవడం శాంతి భద్రతల అంశం ఇలా అన్ని సంఘటనలు టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి.

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అత్యంత ఆగ్రహంగా ఉన్నది ఎవరు ఉన్నది అని మనం అని ఆలోచిస్తే నిరుద్యోగులు అని చెప్పక తప్పదు.

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ పెద్ద నోటిఫికేషన్ లు ఏవీ రాలేదు.

వయస్సు మించిపోతున్నా ప్రభుత్వం నోటిఫికేషన్ లు విడుదల చేయకపోవడం పట్ల అగ్రహించిన నిరుద్యోగులు నిజామాబాద్ తరహాలో నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

అలాగైతేనే ప్రభుత్వం దిగి వస్తుందని, నిరసన ద్వారా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అవటం లేదని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ విషయం గ్రహించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసన సభలో త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇవ్వనున్నామని మంత్రి హరీష్ రావు శాసన సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అయితే నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఉద్యోగాల ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక నిరుద్యోగుల నిర్ణయం ఎలా ఉండనుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అనిల్ రావిపూడిని కొట్టిన వాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చిన జక్కన్న.. షాక్ లో డైరెక్టర్!