ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య కు నిరసనగా నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోనలు....

ఇంకా ఎంత మంది నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు చనిపోతే మీకు సోయి వస్తుంది అని నిరుద్యోగ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓయూ లోని ఎన్ సి సి గేట్ వద్ద ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య కు నిరసనగా నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు.

అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, తమ ఉద్యోగాలలో భద్రత లేక ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే దరిద్రం తెలంగాణలో కొనసాగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ఖాళీగా ఉన్న లక్షా తొంభై రెండు వేల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాబట్టి నిరుద్యోగ ఆత్మహత్య లను ప్రభుత్వం ఆపే విదంగా కృషి చేయాలని లేని పక్షంలో మరో ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఓట్స్ ఆరోగ్య‌క‌ర‌మే.. కానీ వారు తిన‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌..!