వైసీపీ ప్రభుత్వంపై ఉండి ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్..!!

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు( Mantena Ramaraju ) వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ధరలు, పన్నులు పెంచడమే తప్ప తగ్గటం లేదని స్పష్టం చేశారు.

సోమవారం ఆకువీడులో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆయన ధర్నా చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు( Electricity Charges ) పెంచనని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారని చెప్పారు.

కానీ అధికారంలోకి వచ్చాక ఏకంగా ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలను సీఎం జగన్ పెంచడం జరిగిందని పేర్కొన్నారు.

వైసిపి పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటిపడిందని సీరియస్ కామెంట్స్ చేశారు.గ్రామాలకు మంజూరైన నిధులు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో వెనక్కి కూడా వెళ్ళిపోయాయని ఆరోపించారు.

ఇదే సమయంలో ఏ గ్రామం వెళ్లిన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ వంటి ప్రధాన సమస్యలపై .

ప్రజలు నాయకులను నిలదీసే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పుకొచ్చారు.ఎలాంటి ప్రభుత్వం అధికారంలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు స్పష్టం చేశారు.

సోమవారం నియోజకవర్గంలో అనేక చోట్ల పర్యటించి వివిధ సమస్యలపై ఎమ్మెల్యే తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు .. యూకే పార్లమెంట్‌లో తీర్మానం