ఓటు వేసే విధానంపై అవగాహన తప్పనిసరి
TeluguStop.com
ఐ డి ఓ సి లో ఈవీఎం, వీవీప్యాట్‌ల ప్రదర్శన కేంద్రం ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈవీఎం, వీవీప్యాట్‌ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్‌ల ప్రదర్శన కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు , ఐ డి ఓ సి లోని ప్రభుత్వ శాఖల కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
ఇప్పటికే సిరిసిల్ల , వేములవాడ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున రెండు ప్రచార రథాలను ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలలో కూడా ఈవీఎం, వీవీప్యాట్‌ల ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
రెండు నెలల కు పైగా ఈ ప్రదర్శన కేంద్రాలు ఓటర్లకు అవగాహన నిమిత్తం అందుబాటులో ఉంటాయన్నారు.
కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ,ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ పాషా, రహమాన్, సీనియర్ సహాయకుడు రహిం, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?