వింత ఆచారం : ఆ దేశంలో ఆలస్యంగా ఇంటికెళితే పెళ్లి చేస్తారట!

సాధారణంగా వివాహానికి సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో విధమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి.

అలా ఇండోనేషియా దేశంలో కూడా వింత ఆచారం అమలులో ఉంది.అయితే ఈ ఆచారం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆచారం కాదు.

ఆ దేశంలోని ప్రజలే వారంతట వారు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.ఆ దేశంలో ఉన్న వింత ఆచారం ఏమిటంటే సూర్యాస్తమయం తరువాత అమ్మాయిలు అబ్బాయిల ఇళ్లకు వెళితే అమ్మాయికి అబ్బాయితో పెళ్లి చేస్తారు.

వినడానికి చిత్రవిచిత్రంగా ఉన్న ఈ ఆచారం దశాబ్దాల నుంచి అక్కడ అమలవుతోంది.చదువుకున్న వాళ్లలో కొందరు ఆ ఆచారాన్ని వ్యతిరేకించినా అక్కడి ప్రజల ఆలోచనా తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.

అక్కడి ప్రభుత్వం సైతం ఈ విచిత్రమైన సాంప్రదాయం విషయంలో పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్కడి ప్రజలు ఇది పురాతన సాంప్రదాయమని తమ పెద్దలు నేర్పించిన ఈ సాంప్రదాయాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని చెబుతున్నారు.

తాజాగా అక్కడ చోటు చేసుకున్న ఒక ఘటన ఈ వింత ఆచారం గురించి ప్రపంచానికి పరిచయం చేసింది.

నుర్ హెరావతీ అనే 12 సంవత్సరాల బాలిక సుహైమీ అనే 15 సంవత్సరాల బాలుడి ఇంటికి వెళ్లి రాత్రి 7.

30కు ఇంటికి చేరుకుంది.బాలిక ఆలస్యంగా ఇంటికి రావటంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు.

అనంతరం సూర్యాస్తమయం తరువాత బాలుడి ఇంట్లో ఉన్నందుకు అతనినే వివాహం చేసుకోవాలని బాలికకు సూచించారు.

ఆ తర్వాత ఇద్దరికీ వివాహం జరిపించారు.ఈ విషయం తెలిసిన అధికారులు బాల్య వివాహాన్ని ఆమొదించబోమని చెప్పారు.

ఇండోనేషియా ప్రభుత్వం ఆ దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని బాలికల వివాహ వయస్సును 16 నుంచి 19 ఏళ్లకు పెంచింది.

అయితే అక్కడి ప్రజలు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి వివాహాలు జరిపిస్తూ ఉండటం గమనార్హం.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?