వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే ట్యాగ్ లైన్ తో కార్యక్రమం

నక్కపల్లి మండలంలో బంగారయ్యపేట ,పెద తీనార్ల గ్రామాల్లో తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ,పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే ట్యాగ్ లైన్ తో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే ,రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ ఏ వర్గానికి న్యాయం చేయలేని ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది.

తెలుగుదేశం కు పాయకరావు పేట నియోజకవర్గం లో 18 మత్యకార గ్రామాలున్నాయని ఆ మత్యకార గ్రామాల్లో మత్యకారులు ఎవ్వరికీ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.

తెదేపా హయాంలో ఇచ్చిన డీజిల్ సబ్సిడీ నే ఇప్పటివరకూ ఇస్తున్నారే తప్ప మరే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు.

డీజిల్ పెరిగిన ఈ రోజుల్లో కూడా మత్యకారుల కు డీజిల్ సబ్సిడీ ఇస్తున్నది తెదేపా హయాంలో ఇస్తున్న 9 రూపాయలు మాత్రమే ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

గంగ పుత్రుల మనుగడ కష్టమే మన కష్టార్జితం ను ,మన స్థలాలను దోచుకుంటారు.

మనపిల్లల భవిష్యత్ కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందన్నారు.వై.

సి.పి ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో 50 శాతం కోతలు విదిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరిట మోసం చేస్తున్నారని ఆ మోసాలు మా మహిళలకు తెలుస్తున్నాయన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రోడ్లు వేసుకోలేని దౌర్భాగ్యమైన దుస్థితి ఏర్పడింది.తెదేపా హయాంలో ప్రతీ పల్లెకు సి.

సి రోడ్లు నిర్మిస్తే వై.సి.

పి ప్రభుత్వం మాత్రం రోడ్లు వేయకపోగా నీళ్లు రాని కుళాయిల కోసం రోడ్లను అడ్డగోలుగా తవ్వేస్తున్నారని ఎద్దేవాచేశారు.

రానున్న రోజుల్లో వై.ఎస్.

ఆర్ ప్రభుత్వం కు చరమ గీతం పాడేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ,యువ నాయకులు నారా లోకేష్ యువ గళం పేరుతో యాత్ర ప్రారంభిస్తున్నారని అన్నారు.

ఆ పాదయాత్ర వైభవంగా జరుగుతాదని ,ప్రజలు నీరాజనం పడతారన్నారు.యువగలం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే సదుద్దేశంతో చేస్తున్న యాత్ర ఈ పాదయాత్ర అన్నారు.

తెలుగుదేశం అదినేత చంద్రబాబు ని తెదేపా నాయకులను వై.సి.

పి ప్రభుత్వం నుండి దాడులు ఎన్ని ఎదురైన తేదేపా కార్యకర్తలు ,ప్రజలు తమవెంటే ఉన్నారని తెలిపారు.

అంతకుముందు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే ట్యాగ్ లైన్ తో ఉన్న పోస్టర్ ని ఆవిష్కరించారు.

అనంతరం ఇటీవల ఒంగోలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన డి.ఎల్.

పురం కు చెందిన తెదేపా సీనియర్ నాయకులు గింజాల కనకా రావు గురువును ఆమె పరామర్శించారు.

ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.తెదేపా శ్రేణులు ఎప్పుడూ మీ వెంటే ఉంటారని ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్న ముందుoటారని భరోసా ఇచ్చారు.

సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్న బాలయ్య…కారణం ఏంటి..?