జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతి, యువకులకు నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో కూడిన ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా.
TeluguStop.com
డిసెంబర్ 19వ తేదీ లోపు సంబంధించిన పోలీస్ స్టేషన్ల పరిదిలో పేరు నమోదు చేసుకోగలరు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని యువతీ యువకుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
, శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
డ్రైవింగ్ చేసే వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం అని దానికోసం జిల్లా పరిధిలోని డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని వారి కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మెళ నిర్వహించడం జరుగుతుందన్నారు.
డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని ఆసక్తి గల 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఈ నెల డిసెంబర్ 19 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు (SSC MEMO, ADHAR CARD ) తో మీ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు నమోదు చేసుకోవాలని,పెరు నమోదు చేసుకున్న వారికి డ్రైవింగ్ టెస్ట్ లు నిర్వహించి, అందులో ఆర్హత సాధించిన వారికి తదనంతరం లైసెన్స్ లు జారిచేయడం జరుగుతుందన్నారు.
నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా.
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తో విష్ణు కొత్త సినిమా.. ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇవే!