సిఐటియు ఆధ్వర్యంలో నేతన్న విగ్రహానికి వినతి పత్రం అందజేత

ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి సిరిసిల్ల నేతన్నల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అధ్వర్యంలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో ఉపాధి కోల్పోయిన నేతన్నలందరికీ తక్షణ సహాయం కింద 10 వేలు అందించాలన్నారు.

బతుకమ్మ చీరలు ప్రభుత్వ ఆర్డర్లు అందించి నిరంతరం ఉపాది కల్పించాలి.వర్కర్ టూ ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలి.

బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు రావలసిన 2022 & 2023 సం!!ల 10 శాతం యారన్ సబ్సిడీ వెంటనే అందించాలి.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి.వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గుండు రమేష్ , సబ్బని చంద్రకాంత్ , మోర తిరుపతి , రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

షూటింగ్ కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్.. ఈ బ్యూటీ గ్రేట్ అంటూ?